• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భవనానికి శంకుస్థాపన చేసిన విప్

JGL: భీమారం మండలం గోవిందరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమైక్య సంఘం (VO) భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వెల్లడించారు.

February 23, 2026 / 12:30 PM IST

న్యూడెమోక్రసీ సదస్సు పోస్టర్స్ విడుదల

MNCL: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు CPI (ML) న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం తెలిపారు. రామకృష్ణాపూర్లో సోమవారం సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, మేధావులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు సదస్సులో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

NRML: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వారు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

February 23, 2026 / 12:30 PM IST

పున:ప్రారంభమైన మార్కెట్ ధరలు ఇలా..!

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవులు అనంతరం సోమవారం పున:ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 7,545, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 18,300, క్వింటాల్ వండర్ హట్ ధర రూ. 37,000, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ. 22,100 గా ధరలు నమోదయ్యాయి.

February 23, 2026 / 12:30 PM IST

అంగన్వాడీ టీచర్ నుంచి కార్పొరేటర్

KNR: రామగుండం కార్పొరేషన్ వెంకట్రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేసే రమ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ 16వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా ఆమె పోటీ చేసి విజయం సాధించారు. చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందన్నారు. గత ఎన్నికల్లో అదే డివిజన్‌లో భర్త కిషన్ రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

రేపు సుబ్లేడులో ‘వారాంతపు సంత’ ప్రారంభం

KMM: తిరుమలాయపాలెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం సుబ్లేడులో కొత్తగా వారాంతపు సంతను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రతి వారం ఈ సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంత నిర్వహించే ప్రదేశాన్ని డోజర్‌తో శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 23, 2026 / 12:28 PM IST

రామారావు మృతి బాధాకరం మాజీ ఎమ్మెల్యే బొల్లం

SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ శరభయ్య తండ్రి రామారావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:26 PM IST

సమస్యలపై సమరం.. పనులు ప్రారంభం

RR: ఆమనగల్ మున్సిపాలిటీలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ పత్యానాయక్, పాలకవర్గం పనులపై దృష్టి సారించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో పగిలిపోయిన మంచినీటి పైపులు పర్యవేక్షించారు. వెంటనే వాటిని మరమ్మతు చేసే పనులను ప్రారంభించారు. సమస్యలను వెంటనే పాలకవర్గం పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 12:24 PM IST

‘వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి’

MLG: జిల్లా జాకారం గ్రామ శివారులోని NH హైవే పై తారు పొరలు లేచి భారీ గుంతలు, ఎత్తుపల్లాలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనా దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.

February 23, 2026 / 12:24 PM IST

MCHRDలో హై సెక్యూరిటీ.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా?

HYD: నగరంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ. 9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్‌కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్టమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంటింగ్ రోడ్లు నిర్మించనున్నారు.

February 23, 2026 / 12:20 PM IST

దివ్యాంగుడికి ఆర్థిక సహాయంఅందించిన ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మండలం లోని గుమ్మడం తాండకు చెందిన లక్ష్మణ్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది.ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణo నిలిచిపోగా తాండకు చెందిన ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేసిక వెళ్లారు. అందుకు మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాడు,దీంతో లక్ష్మణ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపాడు.

February 23, 2026 / 12:19 PM IST

తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి సోమవారం మీడియాతో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్‌తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

February 23, 2026 / 12:18 PM IST

తిప్పనగుల్లలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: నిజాంపేట మండల తిప్పనగుల్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనులలో భాగంగా పనులు ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధి కోళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:17 PM IST

బొట్టుగూడ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండ పట్టణం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమవారం ఉదయం సందర్శించారు. అన్ని తరగతి గదులను తిరుగుతూ పరిశీలన జరిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఆయన గణితం బోధించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. నాణ్యమైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు.

February 23, 2026 / 12:16 PM IST

నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఖానాపురం సమీపంలో నేషనల్ హైవే 365 రోడ్డుపై 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డ యువకుడిని వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటనపై ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 12:15 PM IST