• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అకాల వర్షాలతో మామిడి రైతు విలవిల

VKB: కుల్కచర్ల మండలంలో అకాల వర్షాంతో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వేరుశనగ రైతులు పల్లికాయలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మామిడి రైతులు మాత్రం దిగాలుగా ఉన్నారు. వేసవికాలంలో వర్షాలు కురుస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని బాధిత రైతులు వాపోతున్నారు.

February 25, 2026 / 08:21 PM IST

మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

SRCL: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఖదీర్ పాషా వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 08:18 PM IST

‘చిత్తడి నేలలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం’

NRML: చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

February 25, 2026 / 08:15 PM IST

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు: డీపీవో

JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తా

SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ వైస్ చైర్మన్ రేణుకలు ఇంఛార్జ్ మంత్రి వివేక్‌ను బుధవారం కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 08:11 PM IST

పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుష్కర దేశాలలో ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైట్లు, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు కట్టుదిట్టంగా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

February 25, 2026 / 08:10 PM IST

సిరికొండ-కమ్మార్‌పల్లి అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు

NZB: జిల్లా సిరికొండ మండలం కమ్మార్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా (నిజామాబాద్), ఆర్మూర్ అటవీ విభాగాధికారి బీ. భవాని శంకర్, సిరికొండ ఎఫ్.ఆర్.వో నర్సింగరావు, శక్తి గంగారం, క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టారు.

February 25, 2026 / 08:05 PM IST

రేపు కోదాడకు రానున్న కేటీఆర్

SRPT: లాకప్ డెత్‌లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు కోదాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మధ్యాహ్నం లోపు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకోవాలని కార్యాలయం ఇవ్వాళ ఒక ప్రకటనలో కోరింది.

February 25, 2026 / 08:04 PM IST

చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

NLG: ఈ నెల 17న చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్ (34) ఫిబ్రవరి 17న కూలి పని కోసం భైరవునిబండ నుంచి మిత్రుడితో చౌటుప్పల్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి వద్ద బైకు అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

February 25, 2026 / 08:03 PM IST

అంబులెన్స్‌ పైలెట్లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం

ASF: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్‌ పైలెట్లు జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్‌లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం లభించింది. బుధవారం ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ కె. హరిత,DMHO సీతారాం చేతుల మీదుగా అందుకున్నారు. అత్యవసర సేవల్లో వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

February 25, 2026 / 08:03 PM IST

‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం’

KMR: శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కామారెడ్డి ASP చైతన్య రెడ్డి అన్నారు. పల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ సమయంలో స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయించిన సర్పంచ్ నర్సింహారెడ్డి దంపతులను పాలకవర్గాన్ని ఆమె అభినందించారు. ఎస్సై అనిల్‌, బట్టెంకి బాలరాజు ఉన్నారు.

February 25, 2026 / 08:02 PM IST

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

BHNG: భయాందోళనలో చెందకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, సకాలంలో హాజరై పరీక్షలు రాయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 08:02 PM IST

స్వచ్ఛ సర్వేక్షన్‌-2026 లక్ష్యంగా పనిచేయాలి: మేయర్‌

KNR: కరీంనగర్‌ నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2026లో ఉత్తమ ర్యాంకు సాధించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డులో వంద శాతం చెత్త సేకరణ జరగాలన్నారు.

February 25, 2026 / 08:01 PM IST

చారిత్రక వారసత్వం..శ్రీరంగాపురం ఆలయ విశిష్టత

WNP: వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం.

February 25, 2026 / 08:01 PM IST

‘ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయవద్దు’

ADB: ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన అవసర లేదని, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని ఝరి PHCలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

February 25, 2026 / 08:00 PM IST