ASF: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్ పైలెట్లు జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం లభించింది. బుధవారం ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ కె. హరిత,DMHO సీతారాం చేతుల మీదుగా అందుకున్నారు. అత్యవసర సేవల్లో వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.