• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక: ఎమ్మెల్యే

NGKL: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆమనగల్ పట్టణ కేంద్రంలో అబ్దుల్ జబ్బర్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

March 4, 2026 / 04:41 AM IST

ఆర్సీవోఏ క్లబ్‌లో డైనింగ్ హాల్ ప్రారంభం

PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీడీకే-ఆర్సీవోఏ క్లబ్ ఆవరణలో ఇటీవల నిర్మించిన డైనింగ్ హాల్‌ను RG-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్లబ్ అభివృద్ధిలో భాగంగా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అధికారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

March 4, 2026 / 04:03 AM IST

ప్రభ బండిని ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని స్వామి రావులపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని కోరారు.

March 3, 2026 / 10:20 PM IST

జిల్లాలో వైన్స్ బంద్.. కలెక్టర్ కీలక ఆదేశం

హోలీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మెదక్ జిల్లాలో వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ‘డ్రై డే’గా ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

March 3, 2026 / 09:35 PM IST

ఆనందపురంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

BDK: అశ్వాపురం మండలం ఆనందపురానికి చెందిన బండారి పుల్లయ్య మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆయనను వెంటనే మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

March 3, 2026 / 09:28 PM IST

3 రోజులు మిషన్ భగీరథ నీరు సరఫరా అంతరాయం

BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి విస్తరణ పనుల దృష్ట్యా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం అధికారులు తెలిపారు. పైప్లాన్ మళ్లింపు పనుల కారణంగా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

March 3, 2026 / 09:22 PM IST

జోరుగా ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలు

VKB: పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో అనుమతులు ఏమి లేకుండా ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ఓవర్ లోడ్‌తో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం భారీ ఎత్తున గండిపడుతోంది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 206లో ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు తవ్వకాలు జరుపుతున్నారు.

March 3, 2026 / 09:17 PM IST

ప్రమాదకరంగా గుండ్లపల్లి – పొత్తూరు రహదారి

KNR: గుండ్లపల్లి–పొత్తూరు రహదారి ప్రమాదకరంగా ఉందని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడమే తప్ప, ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. 100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, ఉన్న రహదారిపై కంకర పోసి వదిలేశారని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.

March 3, 2026 / 09:07 PM IST

ఇంట్లో గంజాయి విక్రయం.. వ్యక్తి అరెస్ట్

NZB: ముస్తాదురాలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఎచ్‌వో స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడు షేక్ అబ్దుల్ ఖైజర్ నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

March 3, 2026 / 09:06 PM IST

గ్రహణానంతరం రాజన్నని దర్శించుకున్న విప్

SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. శుద్ధి చేసిన అనంతరం ఆలయాన్ని తెరవడంతో ఆలయ ఈవో రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

March 3, 2026 / 09:00 PM IST

గాడుదల గండి గుట్ట మలుపు వద్ద బోల్తా పడిన ఇసుక లారీ

PDPL: మంథని పట్టణ పరిధిలోని గాడుదుల గండి గుట్ట మలుపు వద్ద ఇసుక లారీ బోల్తా పడింది. కొయ్యూరు వైపు నుంచి మంథని వైపు వచ్చే లారీ గుట్ట దిగేటప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్‌‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.

March 3, 2026 / 09:00 PM IST

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌ మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఫాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతం శాంతిని బోధిస్తుందన్నారు.

March 3, 2026 / 09:00 PM IST

వట్టెంలో వైభవంగా గరుడ పతాకావిష్కరణ

NGKL: వట్టెంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణ చార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించి, భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

March 3, 2026 / 09:00 PM IST

చికిత్స పొందుతూ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మృతి

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎడ్ల రాజు (35) అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా, చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువ నాయకుడు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.

March 3, 2026 / 08:55 PM IST

‘వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపడం BRS పార్టీ లక్ష్యం’

SRPT: సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు వేముల నాయక్ అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో గరిడేపల్లి మండలంలోని గారకుండా తండా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుడైన శంకర్‌కు ఆయన స్కూటీ అందజేశారు.

March 3, 2026 / 08:53 PM IST