• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డైట్ కళాశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ

KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఆధ్వర్యంలో రూ. 13 కోట్ల వ్యయంతో డైట్ క్యాంపస్ అభివృద్ధి మరియు డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్‌గ్రేడేషన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ హాజరై శంకుస్థాపన చేశారు.

February 21, 2026 / 02:56 PM IST

విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి

BDK: ఇల్లందులో జామాయిల్ కర్రలు నరకడానికి వెళ్లిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఐటీసీ జామాయిల్ సప్లై చేసే ఓ కాంట్రాక్టర్ ఆ మృతికి తనకేమీ సంబంధం లేదని ఎటువంటి అగ్రిమెంట్లు లేవని తీర్చి చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

February 21, 2026 / 02:55 PM IST

లింగంపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక

కామారెడ్డి: లింగంపేట మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సక్రు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచులు అభినందించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 02:53 PM IST

నిషేధిత బయో పురుగు మందుల విక్రయం.. రైతుల ఆందోళన

SRPT: మట్టపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప ఆగ్రో ఏజెన్సీలో నిషేధిత బయో పురుగుమందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుండి తెచ్చిన బయో రసాయనాలను స్థానికంగా విక్రయిస్తూ, ముఖ్యంగా వరి పంటలకు విస్తృతంగా పిచికారి చేస్తున్నారనే వాదనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు ఆ షాప్‌పై రైడ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

February 21, 2026 / 02:53 PM IST

గ్రామస్తులతో మంత్రి ముఖాముఖి

NGKL: కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో మంత్రి జూపాలి కృష్ణారావు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాం వంటి వసతులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 02:50 PM IST

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

JGL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలంలోని హనుమాజీపేట గ్రామంలో బొడ్డు మౌనిక-సురేశ్‌ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సర్పంచ్ బొడ్డు దామోదర్, అంజా గౌడ్, నక్క సతీశ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:49 PM IST

ఖానంపల్లిలో అంగన్వాడి సేవలపై అధికారులు దృష్టి

PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు, బలామృతం పంపిణీని పరిశీలించారు. సర్పంచ్ కాల్వ సుగుణ–మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి యమున–రాజేందర్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:45 PM IST

రసాయన ఎరువులు మోతాదులో వాడాలి: ఎమ్మెల్యే

WGL: రసాయన ఎరువులను తగు మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండయిలపల్లి గ్రామంలో మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనులు వాడడం వలన పంట దిగుబడి సరిగ్గా రాదని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు.

February 21, 2026 / 02:45 PM IST

బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎల్‌వోసీ అందజేత

జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి తాళ్లపల్లి నరసింహులు వేరికోసిల్ (కాళ్ల నరాల) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2 లక్షల LOCని మంజూరు చేయించి, నేడు అందజేశారు.

February 21, 2026 / 02:45 PM IST

రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు విద్యార్థులు ఎంపిక

కామారెడ్డి: జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి శ్రీరంగ వేంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ యోగాసనా పోటీలు నేటి నుంచి 23 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు స్వర్ణ, రజక పతకాలు తీసుకురావాలని ఆయన కోరారు.

February 21, 2026 / 02:43 PM IST

HYDలో ఉగ్ర కుట్ర.. చంచల్‌గూడ జైలులో ప్లాన్.?

HYD: చంచల్‌గూడ జైలు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ HYDలో ఉగ్ర కుట్రకు మాస్టర్ మైండ్ వ్యవహరించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం లభించే ‘ములాకత్’ సమయాన్ని ఉపయోగించుకుని, బయట ఉన్న తన అనుచరులకు రహస్యంగా ఆదేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

February 21, 2026 / 02:41 PM IST

పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

MDK: చేగుంట మండలంల వడియారం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాతృభాషలో చదువుకున్నప్పుడే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం సులువు అవుతుందని, మాతృభాష పట్ల ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని పాఠశాల హెచ్ఎం సిద్ధిరాములు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:40 PM IST

పశువుల అక్రమ రవాణా పట్టివేత

BDK: అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టీడీపీ సెంటర్ వద్ద మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వాహనమునందు బంధించి తరలిస్తున్న 12 పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:39 PM IST

‘బేస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్ పథకానికి ప్రతిపాదనలు ఆహ్వానం’

KMR: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న“టెస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్”పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

February 21, 2026 / 02:39 PM IST

‘కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం’

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితోనే సాధ్యం అవుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు.

February 21, 2026 / 02:36 PM IST