MHBD: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజక్షన్ అవసరమనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిన దంతాలపల్లికి చెందిన యువకులు విరాళాలు సేకరించారు. మొదటి రోజు సేకరించిన మొత్తం రూ.35వేలను పునర్విక కుటుంబానికి అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.
MBNR: అడ్డాకల్ మండలం కందూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపులో రూ.5.08 లక్షల ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించుకున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో వందరోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. ప్లాన్ ప్రారంభించిన అధికారులు 100 రోజుల పాటు నిర్వహిస్తారు. రోడ్లు మొత్తం క్లీన్ చేయడం, దోమల బెడద తగ్గించడం, పరిశుభ్రం, పచ్చదనం, అభివృద్ధి సహా అనేక అంశాలను ఇందులో జోడించినట్లుగా తెలిపారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కింది స్థాయి అధికారులకు ఆదేశించారు.
NRPT: మక్తల్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, మైనార్టీ గురుకుల కాలేజ్, స్కాలర్స్ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌లలో పరీక్షలు జ...
SRPT- మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని చిన్న యాదగిరిగుట్టగా పిలువబడే అతి పురాతనమైన దేవస్థానంగా పిలవబడే లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్య ఒక ప్రకటనలో ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుండి వచ్చేనెల మార్చి 5 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయన్నారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు తెలుగు లాంగ్వేజ్ రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రం వద్ద కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
GDWL: భర్త బతికుండగానే వితంతు పింఛన్ పొందుతున్నారనే ఆరోపణలతో గద్వాల 36వ వార్డు కౌన్సిలర్ సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తన పింఛన్ రద్దు చేయాలని ఆమె కోరడంతో ఈ విషయం బయటపడ్డట్లు తెలుస్తోంది. అయితే, తనకు చదువు రాకపోవడం వల్ల అది ఏ పింఛనో తెలియదని, కేవలం తన ఖాతాలో రూ.2 వేలు జమ అయ్యేవని సునీత వివరణ ఇచ్చారు.
MBNR: మిడ్జిల్ మండలం వేములలో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగడ్డ గ్రామపంచాయతీకి చెందిన భాస్కర్ నాయక్ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఆలయ నిర్మాణానికి రూ.1,50,000 విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ కమిటీ ఛైర్మన్ జంగయ్య ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మినహాయించిన నిర్మాణాలు మినహా మిగిలిన 308 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల సామాగ్రిని అంబేద్కర్ భవనంలో భద్రపరిచామన్నారు.
WNP: కుమ్మెరలో జరిగిన దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని వనపర్తి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు తిరుమలేశ్ పాల్గొన్నారు.
NGKL: జిల్లాలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్కరు పరిక్ష రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.
KMR: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్కేసీ, ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో బహుళజాతి కంపెనీలు మంగళవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ తీవ్ర పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు స్వయంగా గ్రామీణ ప్రాంతాలకు రావడం శుభ సూచకమన్నారు.
JGL: బీర్పూర్ సెక్షన్ పరిధిలోని కొల్వాయి సబ్ స్టేషన్‌లో 2 నూతన అదనపు 11కేవీ బ్రేకర్లను జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం మంగళవారం ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనుల్లో భాగంగా అంతరాయం సమస్యకు పరిష్కారం చేపట్టామన్నారు. దీనిపట్ల గ్రామాల విద్యుత్ వినయోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డీఈ, ఏడిఈ, ఏఈ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
BHNG: బీబీనగర్ నుంచి నడికుడికి రైలు మార్గం రెండవ లైన్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు భువనగిరి RDO కృష్ణ రెడ్డి తెలిపారు. భూసేకరణ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి, బొల్లెపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీల చేసి రైతుల భూముల వివరాలను సేకరించినట్లు తెలిపారు.
NZB: 7 ఏండ్ల క్రితం పుట్టింటికి వెళ్లి భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఉరివేసుకొని జగదీశ్ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జగదీష్ 17 ఏళ్ల క్రితం ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 7 ఏండ్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.