WNP: జిల్లా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత విద్యార్థి సంఘాలు, మాదిగ జేఏసీ నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఇతనిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,50,785, కార్ పార్కింగ్‌తో రూ.2,18,00, VIP దర్శనాలతో రూ.2,40,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,65,900, వ్రతాలతో రూ.1,06,000, కళ్యాణకట్ట రూ.65 వేలు, లీజులతో రూ. 2 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,56,844 ఆదాయం వచ్చింది.
MLG: నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి కోయల నర్సింహారావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెలిపారు.
KMM: BJP రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అక్రమ అరెస్టు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని నిరసనను భగ్నం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నాయకులు తెలిపారు.
NLG: అగ్రకుల దురహంకారంతో బీసీ కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు నిందితులను అందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ కలిసి విజ్ఞప్తి చేశారు.
SRD: జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో రాణించడం అభినందనీయమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులను సోమవారం కార్యాలయంలో సన్మానించారు. మొత్తం జిల్లాకు 21 పతకాలు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ సోమవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోదాడ పట్టణాన్ని జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు.
MBNR: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత ఆసుపత్రికి తరలించవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత భవనం పార్కింగ్, ఇతర వసతులతో సౌకర్యంగా ఉందని, సొంత భవనం నిర్మించే వరకు దీన్ని మార్చవద్దని ఆయన కోరారు. ప్రజా సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పునరాలోచించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ADB: నేరడిగొండలోని రోలుమామడ మాజీ సర్పంచ్ హర్కా యాదవరావు, పలువురు నాయకులు MLA అనిల్ జాదవ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
HNK: నక్కలగుట్టలోని NPDCL భవన్‌ను సోమవారం సాయంత్రం తెలంగాణ SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు అత్యంత పారదర్శకంగా జరగాలని, గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో CMD వరుణ్ రెడ్డి ఉన్నారు.
MNCL: కార్మిక, గనుల శాఖ మంత్రి, చెన్నూరు MLA గడ్డం వివేక్ వెంకటస్వామిని, మందమర్రి పట్టణ యూత్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు కిరణ్ పేర్కొన్నారు.
NZB: రుద్రూర్లో తనపై దాడి జరిగిందని పేర్కొంటూ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమవారం రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అయితే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రుద్రూర్ ఎస్సైపై బోధన్ ఏసీపీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ హంసి మనోహర్ తెలిపారు. గ్రామంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. విద్యుత్ సమస్యలు గుర్తించడంతోపాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరాన్ని నమోదు చేశారు. ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు బోనాల బాబు పాల్గొన్నారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన దశావతార వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణుమూర్తి పది రూపాలను ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో కళకళలాడింది. చిన్నారుల ప్రతిభను చూసి భక్తులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
NLG: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు విధించారని ఆ యొక్క గడువును మరో 10 రోజులు పొడగించాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరో పది రోజులు గడువు పెంచాలని కోరారు.