• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దుబ్బాక తొలి మున్సిపల్ సమావేశం

SDPT: దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ పరిధిలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, నీటి సమస్యపై చర్చించారు. ఈ కార్యక్రమంలో MLA కొత్త ప్రభాకర్ రెడ్డి, సభ్యులు ఫాల్గొన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

WNP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన 40 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత

JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి సేవలు మధ్యాహ్నం నుంచి రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ, ఆలయ పూజారి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి గుడిని మూసి వేస్తామన్నారు. తిరిగి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం, అర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయాన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు: MP

SRD: అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు లభిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు భాస్కర్ రిటైర్మెంట్ అభినందన సభ నేడు ఖేడ్‌లోని బసవ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హాజరై ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌కు శాలువ కప్పి సన్మానించారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

RR: రేపు చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి గుడి మూసి వేయడం జరుగుతుందని, తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనాలు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

March 2, 2026 / 02:59 PM IST

ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

MDK: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 2, 2026 / 02:55 PM IST

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహిమూద్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

March 2, 2026 / 02:51 PM IST

ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 2, 2026 / 02:50 PM IST

రత్నవరం ప్రభుత్వ పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ ప్రారంభం

SRPT: నడిగూడెం మండలం రత్నవరం MPPS పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ (LKG, UKG) తరగతులను నేడు మండల విద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట వస్తువులను, తరగతి గదులను వారు పరిశీలించారు. ​ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.

March 2, 2026 / 02:48 PM IST

దుద్దిళ్ళ శ్రీపాద రావు సేవలు మరువలేనివి: కలెక్టర్

ADB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు.  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీపాద రావు సేవలు మరువలేనివని కొనియాడారు.

March 2, 2026 / 02:46 PM IST

‘ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలి’

KMM: ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

March 2, 2026 / 02:42 PM IST

ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరుకావాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు ఆహ్వానం

HNK: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించబోయే ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మార్చి 29వ తేదీన ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘం నేతలు తెలిపారు.

March 2, 2026 / 02:39 PM IST

‘కాంప్లెక్స్‌ను నిర్ణీత సమయానికి ప్రారంభించాలి’

BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆమె తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.

March 2, 2026 / 02:37 PM IST

MBNR: ‘ప్రజాసేవలో శ్రీపాదరావు సేవలు స్ఫూర్తిదాయకం’

MBNR: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన విశిష్ట నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 2, 2026 / 02:37 PM IST

‘వైద్య సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి’

BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం సూచించారు.

March 2, 2026 / 02:37 PM IST