HYD: గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి పోలీసులు భద్రత పెంచారు. ఇరాన్ -ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడ భద్రత ఇచ్చారు. దీంతో 70 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటువైపుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అమెరికన్లు ఉండే హోటల్‌పైన ప్రత్యేక దృష్టి పెట్టారు.
MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక గాయపడింది. తూప్రాన్‌లో నివాసముండే రాణి (9) పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా ఆటో రిక్షా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక రాణి తీవ్రంగా గాయపడగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు వైద్య సేవలు అందజేస్తున్నారు.
SRPT: నడిగూడెం మండలం సిరిపురం ZPHSలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక అట్టహాసంగా జరిగింది. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
NGKL: గ్రామాలు ముంపునకు గురికావద్దని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు చేపట్టిన దీక్షలు సోమవారంతో 91వ రోజుకు చేరాయి. అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
SRD: కంగ్టి మండలం తుర్కవడ్గంకు చెందిన మచ్చేందర్ కంగ్టిలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కనిపించిన ఓ కవర్‌ను తీసి చూడగా అందులో తులం బంగారం కమ్మలు ఉన్నాయి. వెంటనే కంగ్టి ఠాణాకు నేడు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అప్పుడే వారు విచారణ చేపట్టి , బంగారం కమ్మలు దుర్గారాజు వని గుర్తించి అప్పగించారు. మచ్చేందర్ నిజాయితికి SI అభినందించారు.
BHNG: యాదగిరిగుట్ట పట్టణ పరిసర ప్రాంతాల్లో యాసంగి సీజన్ ప్రారంభంలోనే యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలకు యూరియా వేసే సమయంలో సరైన సరఫరా లేక డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి, యూరియా రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.
KMM: మధిర పట్టణంలో ఇటీవల ప్రారంభమైన వంద పడకల ప్రభుత్వాసుపత్రి అప్పుడే సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. చూడటానికి కోటలా ఆసుపత్రి ఉన్న పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. దీంతో మధిరలో పేదోడికి వైద్యం అందరాని ద్రాక్షగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.
BDK: బెల్ట్ షాపుల నియంత్రణపై బీజేపీ జిల్లా అధ్యక్షులు చుక్కపల్లి బాలాజీ సోమవారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బూర్గంపాడు మండల పరిధిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయని గుడి, బడి, తేడా లేకుండా సమయపాలన పాటించకుండా అర్ధరాత్రి వరకు విక్రయాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తక్షణమే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ASF: మహిళలు,చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ SP నితిక పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం ల ద్వారా 54 హాట్ స్పాట్ లలో ,19 అవగాహనా సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళలు ర్యాగింగ్ ,ఈవ్ టీజింగ్, హింసకు గురి అయినట్లయితే జిల్లా షీ టీమ్ ను సంప్రదించాలని సూచించారు.
NLG: నకిరేకల్ మండలం మంగళపల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం బచ్చుపల్లి గంగాధర్ రావు, సర్పంచు గాదరి జయమ్మ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షలతో సంఘబంధం భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మార్కెట్ డైరెక్టర్ బొల్లెద్దు లక్ష్మయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బుజంగరావు, ఉపసర్పంచ్ రామాలింగారావు పాల్గొన్నారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలకు ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. యువత చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వారిపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు.
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట 9వ వార్డు ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల పైకప్పుల మీదుగా ఈ తీగలు వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వారు కౌన్సిలర్ వనం రమేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జనగామ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా దృక్పథం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్లను ఆక్రమించి వాహనదారులకు, పాదాచారులకు నరకం చూపిస్తున్న అక్రమార్కులపై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. HIT TV Newsలో ప్రచురితమైన కథనంతో స్పందించిన అధికారులు, ట్రాఫిక్ ఎస్సై సాయిరాం పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన షాపు యజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడితండా అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం సర్పంచ్ సరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలకు బాలామృతం, పౌష్టిక ఆహారం క్రమం తప్పకుండా అందించాలని అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.