KMRL బిచ్కుంద పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. Lనిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.
ADB: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించాలని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలను అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక అతిముఖ్యమన్నారు.
NZB : ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు 318 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, మొదటిరోజు విద్యార్థులెవరూ ఆలస్యంగా రాలేదని పేర్కొన్నారు.గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
WNP: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో వనిత జ్యోతి మహిళా సంఘం (NGO) సహకారంతో శ్రీరంగాపురం మండలంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మాట్లాడుతూ..కళాకారుల గుర్తింపు కార్డుల ప్రాధాన్యతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తామని బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ భరోసా కల్పించారు.
MNCL: జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి పట్టణాల్లో నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 16మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 156 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245 మంది విద్యార్థులు ఆరుగురు, దండేపల్లి జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షను రాయలేదు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కరణ్ కోట్ పోలీసులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై రాములు అవగాహన కల్పించారు.
NRML: నిర్మల్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని డిఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసారని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రేపటి ద్వితీయ సంవత్సరం పరీక్షకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై కేసు బనాయించడం దారుణమన్నారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్‌ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.
MDK: మెదక్ పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల వివిధ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పెద్దపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నూగిల్ల మల్లయ్య బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
VKB: యాలాల్ మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవానికి 108లో హాస్పిటల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్సును పక్కకాపి EMT నితిన్, పైలట్ మహేందర్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. భాగ్యలక్ష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, గదుల్లో సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించారు.
JN: కొడకండ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు కాగా, అందరూ హాజరయ్యారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదు. పరీక్షా కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు.