• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బిక్కనూర్ మండలంలో రోడ్డు ప్రమాదం

KMR: బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రం అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 26, 2026 / 12:03 PM IST

సమస్యలు పరిష్కరించాలని జీఎంకు వినతి

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ మాట్లాడుతూ.. నస్పూర్‌లోని రోడ్లు విస్తరించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మహా ప్రస్థానం, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు.

February 26, 2026 / 12:03 PM IST

ఉమ్మడి జిల్లా రైతులకు చివరి అవకాశం..!

WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ పోర్టల్‌లో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 11:57 AM IST

‘తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు’

KMM: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 11:57 AM IST

నేడు రాసోల్ లో భూభారతి భూ సర్వే గ్రామసభ

SRD: కంగ్టి మండలం రాసుల్ గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు భూ హద్దుల సర్వే గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ముగ్నీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరవుతున్నట్లు తెలిపారు. కావున గ్రామ ప్రజలు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 11:56 AM IST

ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ

ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్‌లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలని కోరారు.

February 26, 2026 / 11:51 AM IST

భూనిర్వాసితులకు పరిహారం, పునరావాస హామీ

BHPL: మల్హర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల డేంజర్ జోన్‌లో నివసిస్తున్న భూనిర్వాసితుల సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు తీసుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సచివాలయంలో జరిగిన సమావేశంలో జెన్కో సీఎండీ ఎన్.హరీశ్ భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితుల్లో ఆనందం వ్యక్తమైంది.

February 26, 2026 / 11:51 AM IST

తెలంగాణ నుంచి ఒక్కడు!

RR: ఇబ్రాహీంపట్నానికి చెందిన సురేశ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతాజీ సుభాష్ సదర్న్ సెంటర్‌లో డిసెంబర్ 2025- జనవరి 2026 మధ్య నిర్వహించిన ఎన్‌ఐఎస్ (ఖో-ఖో) కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ నుంచి పాల్గొన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

February 26, 2026 / 11:49 AM IST

సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్ నియామకం

SRCL: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్, ఐఏఎస్ (2019) నియమితులయ్యారు. ప్రస్తుతం అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పరిపాలన మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

February 26, 2026 / 11:47 AM IST

ఇఫ్తార్ కార్యక్రమంపై ఎమ్మెల్యే సమీక్ష

NLG: రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంపై అధికారులు ముస్లిం పెద్దలతో ఇవాళ నకిరేకల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష జరిపారు. సోదర భావంతో శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేందుకు అధికారులు ముస్లిం సోదరులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 11:44 AM IST

భువనగిరి కలెక్టర్ బదిలీ

BHNG: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్ నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

February 26, 2026 / 11:44 AM IST

రేపు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, చేర్యాల నూతన కౌన్సిలర్ల పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు.

February 26, 2026 / 11:43 AM IST

‘ఉపాధి కల్పించడం కోసమే ఉపాధి హామీ..!

MDK: కూలీలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం ఊసన్ కుంట చెరువు కట్ట పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 26, 2026 / 11:43 AM IST

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

BDK: త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయొచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా సుమారు 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి.

February 26, 2026 / 11:42 AM IST

కురిక్యాల పీఎసీఎస్ కార్యదర్శి సస్పెండ్

KNR: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ఎరువుల కొనుగోలులో అవకతవకలు, రుణాల వసూలులో పాత ఓచర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. రామడుగు కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 11:40 AM IST