• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై దాడి..

JN: రఘునాథపల్లి మండలంలోని శివాజీనగర్ శివారులో గురువారం ఉదయం అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ పులి రాజు అలియాస్ రంజిత్ (25), యజమాని బంధువు చిరంజీవి (41)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

February 26, 2026 / 06:52 AM IST

అధ్వానంగా జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు

GDWL: గద్వాల మండలం పుటాన్ పల్లి స్టేజీ దగ్గర ప్రధాన రహదారి ప్రమాద భరితంగా తయారైంది. నిత్యం వేలాది వాహనాలు ఎర్రవల్లి నుంచి గద్వాలకు రాకపోకలను సాగించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇలా ఉంటే రాత్రివేళ ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురికావా..? అని ప్రశ్నిస్తున్నారు.

February 26, 2026 / 06:52 AM IST

నేడు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం చంద్రుగొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారని అన్నారు.

February 26, 2026 / 06:43 AM IST

వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడి.. ఇద్దరికి రిమాండ్

MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం జరిగిన బీరు బాటిల్ దాడి కేసులో, నిందితులైన నితిన్, రాకేష్‌‌లపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అనంతరం పరకాల సబ్ జైల్‌కు తరలించి కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

February 26, 2026 / 06:41 AM IST

‘బ్యాంకింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి’

ADB: బ్యాంకింగ్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని DCCB బ్యాంక్ సమావేశ మందిరంలో బ్యాంక్ మేనేజర్లు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి నిర్దేశించుకున్న అన్ని బ్యాంకింగ్ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 26, 2026 / 06:41 AM IST

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన కలెక్టర్

NRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు, 59 పల్లె దవాఖానాల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా చికిత్సలు అందించాలని అన్నారు.

February 26, 2026 / 06:41 AM IST

ఉప్లూర్‌లో కొవ్వొత్తులతో నిరసన

NZB: కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూరులో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో రెండు నెలల పసికందును ప్రాణం తీసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆ పాపకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

February 26, 2026 / 06:38 AM IST

పొగబెట్టినా పోతలే.. నిద్రపోనిస్తలే..!

HYD: నగరంలో అనేక చోట్ల దోమల బెడద ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తుంది. గల్లీలలో పొగబెట్టినా.. దోమల బెడద తగ్గట్లే, నిద్ర పోనిస్తలే. ఈ నరకంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంత ప్రజలు వాపోతూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడదకు కారణమేంటో కనుగొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 26, 2026 / 06:38 AM IST

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

NRML: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించి, కేసులు నమోదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

February 26, 2026 / 06:37 AM IST

హత్య కేసులో నిందితురాలి అరెస్టు…

HNK: హసన్ పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన బాల్నే మొగిలిని హత్య కేసులో నిందితురాలైన ఆమె మరదలు వంగ ఇందిరను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చేరాలు తెలిపారు. డబ్బుల విషయంలోని గొడవ కారణంగా నిందితురాలు బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి అతన్ని హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వంగ ఇందిరను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

February 26, 2026 / 06:36 AM IST

రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు

KMM: మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ 13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ 10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో FIRలు నమోదు చేసినట్లు తెలిపారు

February 26, 2026 / 06:36 AM IST

దోంచంద, పోన్కల్‌కు నైట్ హల్ట్ బస్సు ప్రారంభం

NZB: దోంచంద, పోన్కల్ గ్రామాలకు నైట్ హల్ట్ బస్సు బుధవారం ప్రారంభమైంది. FEB 7న భట్టాపూర్ ఉప సర్పంచ్ దయానంద్ వినతిపత్రం అందజేయగా అధికారులు స్పందించారు. పూజా చేసి అనంతరం బస్సును ప్రారంభించారు. బస్సు పొన్కల్ నుంచి ఉ.4:30కు బయలుదేరి ఏర్గట్ల, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా HYD, JBS కు ఉ10:10కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో జేబీఎస్ నుంచి బయలుదేరి రాత్రి 10కు పోన్కల్ వస్తుంది.

February 26, 2026 / 06:36 AM IST

కొత్తపల్లిలో నేడు గ్రామసభ

నల్గొండ మండలం కొత్తపల్లి జీపీ ఆవరణలో ఇవాళ గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సభలో గ్రామంలోని రెండు చెరువుల వేలంపాట, ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, మహిళా సంఘం భవన నిర్మాణం వంటి సమస్యలపై చర్చించనున్నట్లు స్థానిక సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు తెలిపారు. ఈ గ్రామసభలో ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేయాలని ఆమె కోరారు.

February 26, 2026 / 06:36 AM IST

కల్యాణం.. కమనీయం

BHNG: యాదగిరిగుట్ట కొండ గుహాలో వెలిసిన భక్తజన బాంధవుడు యాదగిరీశుడి కల్యాణమహోత్సవ పర్వాలు బుధవారం రాత్రి 10:10 గంటలకు కన్నులపండగగా జరిగింది. స్వయంభూ ప్రధానాలయ ఉత్తర మాడ వీధుల్లో నెలకొల్పిన ప్రత్యేక కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణ తంతు అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు.

February 26, 2026 / 06:33 AM IST

నేడు తొర్రూరుకు ఎంపీ కడియం కావ్య రాక

MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:00 గంటలకు నూతన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు హాజరుకానున్నారు.

February 26, 2026 / 06:32 AM IST