SRD: పటాన్ డివిజన్‌లోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.
NRPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డా. వినీత్ IPS శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు సమృద్ధిగా పంటలు పండించాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందంగా జరుపుకుంటూనే, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
KNR: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకరపట్నం మండల ప్రజలకు ఎస్సై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. పండుగ వేళ ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. పండుగ సంతోషం విషాదంగా మారకుండా స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గోపగాని లక్ష్మణ్ గౌడ్ 30 అనే యువకుడు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల భార్య గొడవ పెట్టుకుని పిల్లలతో తల్లిగారింటికి వెళ్లడంతో మనస్థాపన చెందిన లక్ష్మణ్ బలవన్మరణానికి పాల్పడ్డారు స్థానిక పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.
RR: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందిగామ, కొత్తూరు, కేశంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. 300 మంది లబ్ధిదారులకు రూ. 1.50 కోట్ల విలువైన చెక్కులు మంజూరయ్యాయన్నారు.
MDCL: ఉగాది పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, చిన్న యాదవ్, జేఏసీ వెంకన్న, తుపాకుల జనార్ధన్ కలిసి మల్కాజ్‌గిరి స్థానిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.
NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు గోదావరి జలంతో దేవతలకు గురువారం భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో పంచాంగ శ్రవణం విని, ఉగాది పచ్చడిని స్వీకరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గంగాజలంతో అభిషేకం చేయడం విశేషం.
JGL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అనూష అన్నారు. రాజన్న ఆలయంలోని నిత్యాన్నదాన, ప్రసాదాల తయారీ కేంద్ర ఉద్యోగులకు, సిబ్బందికి ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ADB: ఉట్నూర్‌లోని రామమందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోశ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాశ్చాత్య ధోరణులకు లోనుకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. ఉగాది విశిష్టతను చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
SRD: ఖేడ్ పట్టణం పరిధి మంగళ్ పేట్ భవాని మందిరం ఆలయాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి గురువారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు ఉన్నారు.
HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్‌లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లించనున్నారు.
BHNG: వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ జడిగే బుచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన మాజీ ఛైర్మన్ మొగిలిపాక ముద్దసాని కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శివాజీ యొక్క గొప్ప పనులను స్మరించుకున్నారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
KNR: మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వరరావు 7వ వర్ధంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. చల్ల హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
PDPL: పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతగా మంథనిలో ఓ కూరగాయల వ్యాపారి వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఇంటి నుంచి చేతి సంచి (జూట్ లేదా కాటన్ బ్యాగ్) తెచ్చుకున్న వినియోగదారులకు సదరు వ్యాపారి ఒక కొత్తిమీర కట్టను ఉచితంగా అందజేశారు. “పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పాలిథిన్ కవర్లను నిషేధించి, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే సంచి తెచ్చుకునేలా చేస్తున్నారు.