SRD: నారాయణఖేడ్ పట్టణంలోని జుక్కల్ శివారులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్దతు ధరను రైతులు లబ్ధి పొందాలని సూచించారు. ఇందులో ADA నూతన కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు ఉన్నారు.
BHPL: కార్యకర్తలే BRS పార్టీకి పట్టుకొమ్మలు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మహదేవపూర్ (M) పల్గుల గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRS పార్టీలో చేరారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
NLG: ఆధునిక ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిని వీడి, ప్రజలు మళ్లీ తెలంగాణ ప్రాచీన వంటకాలపై మక్కువ చూపుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో జొన్న రొట్టెలు, పచ్చిపులుసు వంటి సంప్రదాయ రుచులకు ఆదరణ పెరుగుతోంది. హాలియాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వడ్డించిన కుంటికూర, సర్వపిండి వంటి వంటకాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
BHNG: మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ జిన్నే సిద్ధులు గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ ఆచారం గత కొన్ని దశాబ్దాలుగా వస్తోందని, గ్రామస్థులంతా ఏకమై పంచాంగాన్ని వినడం ఇక్కడి ప్రత్యేకత.
JN: హైదరాబాద్ గాంధీభవన్‌లో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులతో కలిసి పంచాంగ శ్రవణ కార్యక్రమానికి TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి హాజరయ్యారు. ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఝాన్సీరెడ్డి ఆకాంక్షించారు.
HYD: సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కల్నల్ ఎస్‌కే ముఖర్జీ ఈ-కార్ట్ వాహనం అందించారు. ముఖర్జీ తల్లిదండ్రులు కల్నల్ ఎస్‌కే మిత్రా, ఆర్మీ మెడికల్ కార్ప్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ అరుణ మిత్ర స్మారకంగా దీనిని వారు అందించారు. ఈ-కార్ట్‌ను కమాండెంట్ బ్రిగేడియర్ విశాల్ వీర్ శర్మ స్వీకరించారు. అనంతరం అధికారులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ADB: ఇచ్చోడ మండలం హీరాపూర్ సహా పలు గ్రామాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఉదయాన్నే తీపి వంటకాలు, ఉగాది పచ్చడి తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రైతులు శుభ ముహూర్తాన వ్యవసాయ పనులను ప్రారంభించారు. పల్లెల్లో పండుగ సందడి నెలకొనగా, నూతన సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
MDCL: హబ్సిగూడ TGSPDCL సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపుతామని విద్యుత్ అధికారులు తెలిపారు. DE ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712471612, FOC హబ్సిగూడ 8712471613, AE 8712471571 నెంబర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కాల్ చేస్తే స్పందిస్తారని పేర్కొన్నారు. SHARE IT
PDPL: ధర్మారం మండలంలోని నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇవాళ ఉదయం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతూ పూజలు చేశారు. సంవత్సరం పొడవునా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పురోహితులు గజవెల్లి ప్రభాకర్ స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ దేవస్థానం గేటు వద్ద ఓబులాయపల్లి గ్రామస్తులు గురువారం ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఉగాది పండుగ సాంప్రదాయం సందర్భంగా ప్రజలకు పచ్చడి పంపిణీ చేశామన్నారు. ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామన్నారు.
MLG: వెంకటాపూర్ మండలంలోని అడవిరంగాపూర్ గ్రామంలో పరాభవ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని సర్పంచ్ సర్పంచ్ దొంతరబోయిన లక్ష్మి-కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
WNP” రేవల్లి మండలం లోని కెనాల్ కాల్వలో పేరుకుపోయిన ముళ్ళపోదలను తొలగించే పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పర్వతాలు ముళ్లపొదలను తొలగించ కార్యక్రమం చేపట్టారు. కెనాల్ కాల్వలో చెట్లు పిచ్చి మొక్కలు భారీగా పెరిగి నీరు పారకంతో ఇబ్బందులు వస్తున్నాయని రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే స్పందించారు. నేడు పనులు ప్రారంభించేందుకు రైతుల కృతజ్ఞతలు తెలిపారు.
VKB: బషీరాబాద్ మండల్ జీవన్గి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రత తీవ్ర రూపం దాల్చింది. బిందే నీటి కోసం మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కాలనీలో రెండు బోర్లు ఉండగా ఒక బోరులో పూర్తిగా మీరు అడగండి అరగంటకు ఒకసారి బోరుపోస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కొన్ని నీటిని పట్టుకుని కాలం గడుపుతున్నట్టు వాపోయారు.
WGL: ఉరుసు కరీమాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ (40) ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగా కొన్న ఆటోకు ఈఎంఐలు చెల్లించలేక ఒత్తిడికి గురైన ఆయన, ఈ నెల 16న వరంగల్ బస్టాండ్ సమీపంలో పురుగు మందు తాగాడు. గమనించిన తోటి ఆటో డ్రైవర్లు MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.
MNCL: కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు సందర్భంగా సర్పంచ్ తోగురు శ్రీనివాస్ విద్యార్థులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.