• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు స్వాధీనం

MHBD: ఎలాంటి అనుమతులు లేకుండా పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను స్థానిక తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

March 19, 2026 / 09:33 AM IST

మండలంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు

VKB: దుద్యాల్లోని రైతు వేదికలో ఎస్ఎమ్ఎమ్ 2025-26 పథకంలో మంజూరైన 7 రోటవేటర్లను లబ్ధిదారులకు అందించారు. దుద్యాల మండల వ్యవసాయ అధికారి నాగరాజు తైవాన్ స్పేయర్స్ సీడ్ డ్రిల్స్ కల్టివేటర్స్ వంటివి రైతులకు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఏఈవోలు భావన, జ్యోతి ఉన్నారు.

March 19, 2026 / 09:33 AM IST

‘రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలి’

JGL: మల్యాల మండలంలోని రైతులు యాసంగి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని AO చంద్ర దీపక్ తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు ఫారంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయలన్నారు.

March 19, 2026 / 09:31 AM IST

ప్రజల జీవితాల్లో సంతోషం పెరగాలి: ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషం పెరగాలని, ఈ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 19, 2026 / 09:30 AM IST

ఉగాది పండుగకు సిద్ధమైన తెలుగు లోగిళ్లు

NLG: వసంతం రావడంతో తెలుగు లోగిళ్లు ఉగాది పండుగకు సిద్ధమయ్యాయి. గతేడాది వింత వ్యాధితో ఎండిపోయి రంగు మారిన వేప చెట్లు, ఇప్పుడు చిగురించి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వేప పువ్వు కొరత ఉంటుందని ఆందోళన చెందిన భక్తులకు, చెట్లు నిండుగా పూత పూయడం పెద్ద ఉపశమనాన్నిస్తోంది. ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేప పువ్వు పుష్కలంగా లభించనుంది.

March 19, 2026 / 09:29 AM IST

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

NGKL: వెల్దండ మండలం అజిలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కేశమోని కర్ణయ్యకు చెందిన ఎద్దు పొలం పక్కన ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. లక్ష విలువ ఉంటుందన్నారు. తమ ఎద్దు మరణించడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ వారు న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరారు.

March 19, 2026 / 09:22 AM IST

మార్కెట్‌లోకి ‘నాలుక కండోమ్స్’

HYD: సురక్షితమైన ఓరల్ సెక్స్ కోసం ‘నాలుక కండోమ్'(టంగ్ స్లీవ్స్) ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. సాధారణ కండోమ్‌ల లాగే ఇవి లాలాజలం ద్వారా వ్యాపించే హెచ్ఐవీ, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులను అరికడతాయి. వివిధ ఫ్లేవర్లలో లభించే ఇవి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా రక్షణనిస్తాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో వీటి వినియోగం పెరుగుతోంది.

March 19, 2026 / 09:21 AM IST

రాగంపేట పాఠశాలలో ముందస్తు ఉగాది పండుగ సంబరాలు

KNR: చొప్పదండి మండలం రాగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు ముందస్తు ఉగాది పండుగ సంబరాలను నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను, ఉగాదిని జరుపుకుంటారనే విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

March 19, 2026 / 09:18 AM IST

సిద్ధారెడ్డి పాత్ర మరువలేనిది: హరీశ్ రావు

SDPT: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని, ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.

March 19, 2026 / 09:17 AM IST

యాదగిరిగుట్టలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

BHNG: యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వార్డులో అపరిశుభ్రత వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రజలు కౌన్సిలర్ ధనలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఛైర్‌పర్సన్ వాణి గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో, జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో పారిశుధ్య పనులు చేపట్టారు.

March 19, 2026 / 09:14 AM IST

పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

RR: కొత్తూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు పంపిణీ చేసి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రభుత్వ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 09:10 AM IST

బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్‌గా తిరుపతిరెడ్డి

MBNR: ఎదిర గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి తిరుపతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

March 19, 2026 / 09:07 AM IST

ఈనెల 30న మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం

WNP : పెబ్బేరు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఈనెల 30న ఉదయం 11 గంటలకు మున్సిపల్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2026-27 అంచనా బడ్జెట్ ఆమోదం, 2025-26 బడ్జెట్ సవరణ ఆమోదం కోసం ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు హాజరుకావాలని కోరారు.

March 19, 2026 / 09:06 AM IST

తుంగ‌తుర్తిలో వెలగని వీధి దీపాలు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెల‌గ‌క‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తున్నా వీధి దీపాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

March 19, 2026 / 09:05 AM IST

ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

BHNG:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమన్నారు.

March 19, 2026 / 09:03 AM IST