AP: తిరుమల ప్రసాదంపై రాజకీయం చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తప్పు జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం ఇరుపార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. దేవుడి పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలందరికీ తక్షణమే ఐడి కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ, మండల అధికారులు పాల్గొన్నారు.
AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.
AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు తెలిపారు.
SGR: మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కౌన్సిల్లో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ASR: డుంబ్రిగుడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష ఇవాళ చేపట్టనున్నారు. ఈ దీక్షకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
MBNR: గత ఏడు దశాబ్దాలుగా భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ మౌలిక అంశాలను స్పష్టం చేస్తున్నదని సామాజిక విశ్లేషకుడు, పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా. నాగం కుమారస్వామి తెలిపారు. రాజ్యాంగం పాలకులకోసం మాత్రమే కాదు, పీడిత ప్రజల విముక్తికి రూపొందించబడిన పవిత్ర గ్రంథమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు.
ELR: DCMS ఏలూరు నిత్యవసర సూపర్ మార్కెట్‌లో వేరుశనగ నూనె కిలో 300 పప్పునూనె (నువ్వులు) కిలో 370లకు లైవ్‌లో అందుబాటులో ఉందని డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. కావున ప్రజలందరూ నిత్యవసర సరుకులు, నూనెలు తక్కువ ధరకు లభించునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణ్ణంపల్లి సొసైటీ ఛైర్ పర్సన్ అక్కి శెట్టి సాయి సుధాకర్ పాల్గొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని పీఆర్ రోడ్డు నుంచి సోమార్పేట్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.44 కోట్లతో భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు.
SKLM అంగన్వాడీల వేతనాల పెంపు, ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంపు కోరుతూ మార్చి 2న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.
MDK: చేగుంట మండలం రుక్మాపూర్‌లో ఏజెన్సీ కంపెనీ ద్వారా వరి సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, సర్పంచ్ నవీన్, pacs ఛైర్మెన్ పరమేశ్, ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు పాల్గొన్నారు.