• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భారత్‌‌కు పెరుగుతున్న సైబర్ ముప్పు

భారత్‌లో సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది దాడులు 2 శాతం పెరిగి, వారానికి సగటున 3,195కి చేరాయి. ముఖ్యంగా AI సాయంతో విద్యా, ప్రభుత్వ రంగాలపై దాడులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితం కాగా, 70శాతం దాడులు ప్రమాదకరమైన ట్రోజన్ మాల్వేర్‌తోనే సాగుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ వాడకంలో అప్రమత్తత చాలా అవసరం.

February 25, 2026 / 11:38 AM IST

డీలిమిటేషన్ పక్కా.. మహిళలకు 5 సీట్లు రిజర్వ్?

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియ పక్కా అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనాభా లెక్కలు, కులగణన పూర్తి కావడంతో మున్సిపల్ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 12 స్థానాలు ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మరో 3 సీట్లు జత కలిసి 15 సీట్లు అవుతాయని అంచనా. ఇందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.

February 25, 2026 / 11:38 AM IST

‘అధిక పాల దిగుబడికి మేలు జాతి కోసం ఎంపిక చేసుకోవాలి’

AKP: అధిక పాల దిగుబడికి రైతులు మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సూచించారు. రాంబిల్లి మండలం దిమిలిలో బుధవారం పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో నిర్వహించిన లేగ దూడల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతి అయిన పశువులను ఉత్పత్తి చేయవచ్చునన్నారు.

February 25, 2026 / 11:37 AM IST

గ్రంథాలయాలు ప్రగతికి నిలయాలు: రామకృష్ణ

JN: గ్రంథాలయాలు ప్రగతికి నిలయాలు అని నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. గ్రామంలోని గ్రంథాలయాన్ని స్థానిక నేతలతో కలిసి సర్పంచ్ పరిశీలించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అన్నారు. ఉపసర్పంచ్ కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 25, 2026 / 11:37 AM IST

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీఐ

HYD: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని కాచిగూడ ట్రాఫిక్ సీఐ బి.వీర కౌశిక్ అన్నారు. కాచిగూడ ట్రాఫిక్ PS ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని, ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ మృత్యువాత పడుతున్నాని అన్నారు.

February 25, 2026 / 11:37 AM IST

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

WNP: శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న ఈ గుడి అద్భుత శిల్ప కళతో భక్తులను కట్టిపడేస్తోంది. కాగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

February 25, 2026 / 11:36 AM IST

‘జనసేనాని సిద్దాంతాలకు అనుగుణంగా ముందుకెళ్దాం’

VZM: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో పార్టీ భావజాలన్నీ, సిద్ధాంతాలుకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్దానిక BC కాలనీలో మాట్లాడుతూ జనసేన సభత్వ నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నామని, సబ్యత్వ రెన్యవల్, లేదా నూతన సబ్యత్వానికి 9573838144 నెంబరుకు సంప్రదించాలని సూచించారు.

February 25, 2026 / 11:36 AM IST

పెద్దముడియంలో 300 సంవత్సరాల బురుజు

KDP: పెద్దముడియం మండలం అంటే బాంబులు, కత్తులు ఫ్యాక్షనే గుర్తుకొస్తుంది. కానీ పెద్దముడియంలో పురాతనమైన కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పాలెగాళ్ల కాలం నాటి బురుజులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బురుజుకు దాదాపు 300 సంవత్సరాల క్రితం కట్టించారు. పూర్వంలో శత్రువులు తమ ఊరిలోకి వస్తే ఆ బురుజులో నుంచి శత్రువులను గుండ్రాళ్లతో తరిమికొట్టేవారు.

February 25, 2026 / 11:33 AM IST

బాధితునికి CMRF చెక్కు అందజేత

NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామానికి చెందిన దారా ప్రదీప్ అనే యువకుడు ఇటీవల గనిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1లక్ష మంజూరు కావడంతో వాటిని టీడీపీ నాయకుడు రామేశ్వర్ రెడ్డి బాధితునికి అందజేశారు.

February 25, 2026 / 11:32 AM IST

జిల్లాకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఎమ్మెల్యే

ADB: విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడతయాని ఎమ్మెల్యే తెలిపారు.

February 25, 2026 / 11:32 AM IST

ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండలం రామ గోవిందాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 11:32 AM IST

21వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: కౌన్సిలర్

HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కౌన్సిలర్ సూదమల్ల రమేష్ అన్నారు. వార్డు పరిధిలోని పలు కాలనీలలో నేడు కౌన్సిలర్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని శానిటేషన్ పనులను పరిశీలించారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కౌన్సిలర్ కోరారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రమేష్, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 11:30 AM IST

రాష్ట్ర రైతు రత్న అవార్డు గ్రహీత కు సన్మానం

BDK: అశ్వాపురం మండలానికి చెందిన రైతు చిగురుపాటి భద్రయ్య వరి పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన స్టేట్ రైతురత్న అవార్డు అందుకోవడం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. బుధవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రయ్యని ఎమ్మెల్యే పాయం ఘనంగా సన్మానించి శాలువా కప్పి సత్కరించారు.

February 25, 2026 / 11:28 AM IST

ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇంటిని అందిస్తాం: ఎమ్మెల్యే

RR: నందిగామ మండల పరిధిలోని ధన్‌సింగ్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇంటిని అందిస్తామన్నారు.

February 25, 2026 / 11:26 AM IST

అక్షయ్‌ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి: మృణాల్‌

బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై నటి మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన శరీర బరువుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తనలో ధైర్యాన్ని నింపిందని తెలిపింది. ‘మీరు మీలాగే ఉండండి. మూవీ పాత్ర కోసం అవసరమైతే తప్ప బరువు తగ్గకండి’ అని అక్షయ్ చెప్పిన మాటలు తన ఆలోచనా విధానాన్ని మార్చేశాయని తెలిపింది. ఇప్పుడు ఆ సూత్రాలనే పాటిస్తున్నట్లు పేర్కొంది.

February 25, 2026 / 11:25 AM IST