ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని ఏడో వార్డులో శనివారం స్వచ్ఛంద – స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి వీధిలో శుభ్రత, చెత్త తొలగింపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.
WNP: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ‘సి.ఎం. కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా’ టోర్నమెంట్‌ను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.క్రీడలకు బడ్జెట్లో రూ. 700 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
అన్నమయ్య: ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజేంద్ర ప్రసాద్‌ను హైదరాబాద్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమకాలీన అంశాలు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించారు. యువతకు ప్రేరణగా నిలుస్తున్న రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో కేశ్వర్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల వివరాలను 2025 జాబితాతో అనుసంధానం చేసే (Mapping) కీలక ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
‘రోసిన్’ సిరీస్‌లో తాను అమ్మ పాత్ర పోషించానని మీనా తెలిపింది. ‘నేను అమ్మను అయ్యాకే సిరీస్‌లోని తల్లి పాత్ర విలువను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలిగా. అందుకే ఎమోషనల్ సీన్స్‌లో ప్రతి డైలాగ్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటి తరం పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన ఎక్కువ, ఏది చెప్పినా తెలుసు అంటారు. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి చెప్పడం వరకే మన బాధ్యత’ అని తెలిపింది.
RR: నందిగామ గ్రామాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో సమస్యలు లేని గ్రామంగా రూపకల్పన చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సర్పంచ్ కొమ్ము కృష్ణ అన్నారు. 3వ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యలపై పోరాటం చేస్తూ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పానుగోడులో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. వ్యవసాయ శాఖ ఏడీఏ కిరణ్ కుమార్ ఇల్లు, కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ ఈ చర్యలు తీసుకుంది. గతంలో ఈయన సూర్యాపేట డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా అమ్మాయిలతో మూడో T20లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 T20ల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరొకటి గెలవగా.. ఇందులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది.
PPM: సీతానగరం మండలం జోగింపేట కేజీబీవీ హాస్టల్ విద్యార్దినీలకు MLHPలోకేశ్వరి శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెమోగ్లోబిన్, జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తగినంత నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
VZM: వంగర ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు శనివారం స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వలన భూగర్భ జలాలు పాడైపోతున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని డిప్యూటీ ఎంపీడీవో రామారావు కోరారు.
కోనసీమ: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆరోపించారు. శాసనమండలిలో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు అపచారంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఈనెల 25వ తేదీన ఎల్లమ్మ జాతర జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఎల్లమ్మ పూజారి రుద్రాక్షల సత్యం, పరశురామున్న పూజారి కర్ణకోట కసవయ్యలు సిరిమాను అధిరోహిస్తారని చెప్పారు. 24న తోలేల ఉత్సవం, 26న కనుము జరుపుతారని తెలిపారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి అనంతరం జరుగుతుందన్నారు.
PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తోట శంకరరావు మాట్లాడుతూ.. భాషల వైవిధ్యాన్ని కాపాడటం, మాతృభాషపై గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.