• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంట్లో గంజాయి విక్రయం.. వ్యక్తి అరెస్ట్

NZB: ముస్తాదురాలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఎచ్‌వో స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడు షేక్ అబ్దుల్ ఖైజర్ నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

March 3, 2026 / 09:06 PM IST

బెట్టింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

AP: నెల్లూరులో ఆర్777 బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహేష్ బాబు, హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రూ.53 లక్షలు మోసం చేయడంతో దర్యాప్తు చేపట్టి, వారి ఖాతాల్లోని రూ.1.64 కోట్లను సీజ్ చేశారు. దుబాయ్, శ్రీలంకలో శిక్షణ పొందిన మహేష్.. అక్కడి నుంచే యాప్ లింకులు పొంది ఈ దందా నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 3, 2026 / 09:06 PM IST

అదృశ్యమైన నలుగురి ఆచూకీ లభ్యం

సత్యసాయి: రొళ్ల మండలంలో అదృశ్యమైన ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారుల కేసును పోలీసులు మంగళవారం ఛేదించారు. హెచ్‌టీ వడ్రహట్టి గ్రామానికి చెందిన లక్ష్మి తన తల్లి సుబ్బమ్మ, పిల్లలు రచన, రోషిణిలతో కలిసి కర్ణాటకలోని ఎల్లంపురం వెళ్లినట్లు ఎస్ఐ గౌతమి తెలిపారు. ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని వారిని గుర్తించి సురక్షితంగా రోళ్లకు తీసుకొచ్చామన్నారు.

March 3, 2026 / 09:06 PM IST

ఈ పండ్లు తినడం వల్ల ప్రయోజనాలు

TG: తాజా పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ు. యాపిల్, అరటిపండు, చిలకడదుంపలు, క్యారెట్లు, ఆవకాడల్లో ఫైబ‌ర్, ప్రీబ‌యోటిక్, ప్రోబ‌యోటిక్ ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యంతో పాటు మొత్తం శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

March 3, 2026 / 09:02 PM IST

గ్రహణానంతరం రాజన్నని దర్శించుకున్న విప్

SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. శుద్ధి చేసిన అనంతరం ఆలయాన్ని తెరవడంతో ఆలయ ఈవో రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

March 3, 2026 / 09:00 PM IST

గాడుదల గండి గుట్ట మలుపు వద్ద బోల్తా పడిన ఇసుక లారీ

PDPL: మంథని పట్టణ పరిధిలోని గాడుదుల గండి గుట్ట మలుపు వద్ద ఇసుక లారీ బోల్తా పడింది. కొయ్యూరు వైపు నుంచి మంథని వైపు వచ్చే లారీ గుట్ట దిగేటప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్‌‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.

March 3, 2026 / 09:00 PM IST

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌ మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఫాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతం శాంతిని బోధిస్తుందన్నారు.

March 3, 2026 / 09:00 PM IST

వట్టెంలో వైభవంగా గరుడ పతాకావిష్కరణ

NGKL: వట్టెంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణ చార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించి, భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

March 3, 2026 / 09:00 PM IST

వినియోగదారుల సంఘాల సమైక్య వైస్ ఛైర్మన్ నియామకం

VSP: రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య వైస్ ఛైర్మన్‌గా విశాఖకు చెందిన పేర్ల భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో 29 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పంపాన వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.

March 3, 2026 / 08:59 PM IST

‘ఇరాన్ పై అమెరికా దాడులును ఆపాలి’

AKP: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్తంగా చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం ఎ. మాధవరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రపంచం శాంతిని కోరుతూ అనకాపల్లి పట్టణం సీపీఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి అశ్రృ నివాళులర్పించారు.

March 3, 2026 / 08:59 PM IST

చికిత్స పొందుతూ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మృతి

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎడ్ల రాజు (35) అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా, చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువ నాయకుడు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.

March 3, 2026 / 08:55 PM IST

‘వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపడం BRS పార్టీ లక్ష్యం’

SRPT: సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు వేముల నాయక్ అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో గరిడేపల్లి మండలంలోని గారకుండా తండా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుడైన శంకర్‌కు ఆయన స్కూటీ అందజేశారు.

March 3, 2026 / 08:53 PM IST

అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం: ఎంపీ

MNCL: కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించి స్థానిక ఎస్సైతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 08:53 PM IST

కడియంలో నీటి సరఫరాకు అంతరాయం

E.G: కడియంలో వాటర్ ట్యాంక్ మరమ్మతుల కారణంగా మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఉదయం వేళ గోదావరి నీరు అందుబాటులో ఉంటుందని, అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు పంపిస్తామని చెప్పారు. కావున ప్రజలు ఈ మార్పును గమనించి తమకు సహకరించాలని కోరారు.

March 3, 2026 / 08:51 PM IST

తిర్యాణిలో విస్తృతంగా వాహన తనిఖీలు

ASF: తిర్యాణి మండలంలో SP నితికా పంత్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా SI వెంకటేష్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

March 3, 2026 / 08:50 PM IST