• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇందుపల్లిలో విద్యార్థులకు అవగాహన

 కృష్ణా: ఉంగుటూరు మండలం ఇందుపల్లి జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చిన్నారులపై నేరాలకు పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని ఎస్సై గోవింద్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు.

February 26, 2026 / 07:24 AM IST

‘వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇక మన దగ్గరే’

HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యాధునిక ‘A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌’ను రాజమౌళి ప్రారంభించారు. ‘బాహుబలి’, ‘ఈగ’ సమయంలో లేని ఈ సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషకరమని, దీనితో భారతీయ సినిమాల స్థాయి మారుతుందని ఆకాంక్షించారు. ‘వారణాసి’ కోసం ఈ టెక్నాలజీని వాడామని, ఫలితాలు అద్భుతంగా వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.

February 26, 2026 / 07:24 AM IST

పేకాట ఆడితే సీరియస్ యాక్షన్: ఎస్ఐ

SRD: పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గారెడ్డి హెచ్చరించారు. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడితే సమచారం ఇవ్వాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినా, జూదరులకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. పేకాట వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని వివరించారు.

February 26, 2026 / 07:23 AM IST

సుప్రీం సీనియర్‌ న్యాయవాది మృతి

AP: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనారోగ్యంతో మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. తండ్రి అన్నంసుబ్బారావు తొలితరం న్యాయవాదిగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ కొనసాగించారు. ఎడీఎన్ రావు మృతిపట్ల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర సంతాపం ప్రకటించింది.

February 26, 2026 / 07:21 AM IST

టెన్త్ విద్యార్థులు ALERT.. 5 నిమిషాలు సడలింపు

MBNR: ఈ ఏడాది 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం 5 నిమిషాల సడలింపును ఇచ్చిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఐదు నిమిషాల సడలింపు అనంతరం పరీక్షకు హాజరయ్యే వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించరని, పరీక్షలు జరిగే రోజున చుట్టుపక్కల ఉండే జిరాక్స్ కేంద్రాలు అన్ని మూసివేయాలని అధికారులకు ఆదేశించారు.

February 26, 2026 / 07:20 AM IST

సెల్‌ఫోన్ దొంగిలించి రూ.3.18 లక్షలు కాజేశారు.!

NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి సెల్ఫోన్ దొంగిలించి, దుండగులు ఫోన్ పే యూపీఐ ద్వారా పలు దఫాలుగా రూ.3,18,000 నగదు కాజేశారు. బుధవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మహాశివరాత్రి సందర్భంగా కాల్వబుగ్గ ఉత్సవాలకు వెళ్లిన సమయంలో రథోత్సవం ముగించుకుని వస్తుండగా ఫోన్ అపహరించారు. బాధితుడు పాణ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

February 26, 2026 / 07:20 AM IST

తీర్లాపురం గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి

BDK: మణుగూరు సింగరేణి ఓ.సి.విస్తరణ నిమిత్తం తీర్లాపురం గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. భూసేకరణ అధికారి ఆదేశాల మేరకు భూమికి సంబంధించిన పత్రాల పరిశీలన గత 15 రోజులుగా కొనసాగుతుంది. అయితే సర్వే చేయించుకున్న కొంతమంది వ్యక్తులు తమ భూమి ప్రాంతములో అందుబాటులో లేరని తేలింది. అందుబాటులో లేని వారు 3 రోజుల గడువులోగా రావాలని తాహాసిల్దార్ నరేష్ తెలిపారు.

February 26, 2026 / 07:20 AM IST

అమరావతిలో ఏడీబీ బృందం పర్యటన

GNTR: ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. మనీలా కార్యాలయానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉండవల్లి పంప్ హౌస్, ట్రంక్ ఇన్‌ఫ్రా పనులు, LPS జోన్ల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్ కన్నబాబుతో సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

February 26, 2026 / 07:20 AM IST

‘కాంగ్రెస్ కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం’

కర్నూలు కాంగ్రెస్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. మార్చి 10లోగా కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. యువకులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, సామాజిక సేవకులు బయోడేటాలతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 07:20 AM IST

బాల్క సుమన్‌కు బిగ్ రిలీఫ్

MNCL: క్యాతనపల్లిలో ఈనెల 17న చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మాజీ MLA బాల్క సుమన్, మరికొందరు BRS నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కాన్వాయ్ పై దాడి, రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారనే ఆరోపణలతో పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. మరో కేసుకు సంబంధించి గురువారం మంచిర్యాల కోర్టులో విచారణ ఉంది.

February 26, 2026 / 07:20 AM IST

నరసాపురం డీఎస్పీ శ్రీవేద బదిలీ

W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్‌కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీల జాబితాలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద పేరు కూడా ఉంది. డీఎస్పీగా శ్రీవేద అనేక సవాళ్లతో కూడిన కేసులను ఛేదించారు.

February 26, 2026 / 07:20 AM IST

భారత్, జింబాబ్వే మ్యాచ్.. మెట్రో ప్రయాణం ఉచితం

క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.

February 26, 2026 / 07:18 AM IST

‘డయల్ యువర్ డీఎం.. కాల్ చేయండి’

NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

February 26, 2026 / 07:16 AM IST

‘కౌలు రైతుల మహాసభలను జయప్రదం చేయాలి’

PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలని, అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, బ్యాంకు రుణాలు, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.

February 26, 2026 / 07:15 AM IST

‘పిఠాపురంలో పన్నులను సకాలంలో వసూలు చేయాలి’

KKD: ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పిఠాపురంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలన్నారు. కమిషనర్ సెలవులో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జ్ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేశారన్నారు

February 26, 2026 / 07:15 AM IST