• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రత్యేక పూజ నిర్వహించిన మాజీ మంత్రి రోజా

CTR: నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం పాదిరి గ్రామంలో శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణుల దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు . ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాకు ఘనంగా స్వాగతం పలికారు.

February 27, 2026 / 01:42 PM IST

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విచారణ

TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కేసీఆర్ తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కాగా మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రభత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సమర్పించింది. అయితే కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు వేశారు.

February 27, 2026 / 01:41 PM IST

భద్రాద్రిలో ఘనంగా నిత్య కల్యాణం

BDK: భద్రాద్రి రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కళ్యాణం జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

February 27, 2026 / 01:40 PM IST

మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

AP: శాసనమండలిలో తాను చూపించిన స్టేట్‌మెంట్ నిజం కాదని మండలి ఛైర్మన్ ఎలా చెబుతారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరిట వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం సీఎస్ పేరిట వస్తుందన్నారు. అసెంబ్లీ సమాచారం సెక్రటరీ జనరల్ పేరిట ఉంటుందన్నారు. మండలి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖ అంటే మండలి ఛైర్మన్ నిర్ణయంగానే పరిగణించకుండా ఎలా ఉంటామని తెలిపారు.

February 27, 2026 / 01:40 PM IST

28న ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏ ఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగును, వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.

February 27, 2026 / 01:40 PM IST

ప్రేమ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!

టాలీవుడ్‌లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ వంటి సీనియర్లతో పాటు.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం-రహస్య, వరుణ్ సందేశ్-వితిక, నాగ అశ్విన్-ప్రియాంక దత్, నాగ చైతన్య-శోభిత, విజయ్-రష్మిక వైవాహిక బంధంలో ఉన్నారు.

February 27, 2026 / 01:40 PM IST

లోన్ యాప్ వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య

MDCL: ఘట్‌కేసర్‌లో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మరో వ్యక్తి ప్రాణం తీశాయి. భార్య పేరుతో లోన్ యాప్‌లో రుణం తీసుకున్న ఆటో డ్రైవర్ సాయికుమార్ (35), సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

February 27, 2026 / 01:39 PM IST

బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై ఎంపీ స్పందన

KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ స్పందించారు. విజయవాడలో ఉన్న ఆయన ఫోన్‌లో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దాదాపు 20 మంది గాయపడటం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 01:38 PM IST

పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం

BDK: మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలో నిర్మించబడిన ఇందిరమ్మ నూతన ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు షేక్ యాకూబీ, ఎస్.కే.బి.బి., మర్రిశెట్టి లక్ష్మీ, తిరుపతమ్మ కుటుంబాల నూతన గృహాల్లో గృహప్రవేశ పూజల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 27, 2026 / 01:37 PM IST

మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

HYD: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నిజాంపేట్ మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పాల్గొన్నారు.

February 27, 2026 / 01:36 PM IST

ఇంటర్ పరీక్షకు 27 మంది గైర్హాజరు

VKB: కుల్కచర్ల మండలంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రామలింగేశ్వర డిగ్రీ కళాశాలలో 228 మంది విద్యార్థులకు గాను 222 మంది హాజరవ్వగా, 6గురు గైర్హాజరయ్యారు. అలాగే వివేకానంద జూనియర్ కళాశాలలో 294 మందికి గాను 274 మంది హాజరయ్యారని, 20 మంది విద్యార్థులు రాలేదని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 01:35 PM IST

వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దశమ వార్షికోత్సవ కళ్యాణానికి హాజరుకావాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం సభ్యులు కోరారు.

February 27, 2026 / 01:35 PM IST

ఎంఈవోపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

KMM: ముదిగొండ MEO రమణయ్యపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ముదిగొండ మండలం రాఘవపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సమస్యలపై MEOను ప్రశ్నించారు. పాఠశాలలో ఐదుగురు సిబ్బంది ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోతున్నారని చెప్పారు. తాను మళ్లీ వచ్చేనాటికి పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉండాలన్నారు.

February 27, 2026 / 01:35 PM IST

ఓటమి చెందిన కౌన్సిలర్ అభ్యర్థిని ఓదార్చిన ఎర్రబెల్లి

MHBD: తొర్రూరు మున్సిపాలలోని 6వ వార్డు నుండి కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందిన రాయిశెట్టి మానస యాకేందర్‌ను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమెకు మనోధైర్యం నింపుతూ.. మేమున్నాం, అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. భవిష్యత్తులో బలమైన మహిళ నాయకురాలుగా ముందుకు సాగాలని పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

February 27, 2026 / 01:35 PM IST

టీమిండియా సెలక్టర్లకు నబీ వార్నింగ్..?

రంజీ సీజన్‌లో జమ్మూకాశ్మీర్‌ బౌలర్ ఆకిబ్ నబీ దూసుకుపోతున్నాడు. ఈ రంజీ సీజన్‌లో నబీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్‌ మెసేజ్ పంపిచినట్లైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన తనను టీమిండియాకు ఎలా ఎంపిక​ చేయరో చూస్తా అన్నట్లుగా ఆడాడు.

February 27, 2026 / 01:34 PM IST