• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భువనగిరి కలెక్టర్ బదిలీ

BHNG: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్ నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

February 26, 2026 / 11:44 AM IST

రేపు పలు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, చేర్యాల నూతన కౌన్సిలర్ల పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు.

February 26, 2026 / 11:43 AM IST

‘ఉపాధి కల్పించడం కోసమే ఉపాధి హామీ..!

MDK: కూలీలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం ఊసన్ కుంట చెరువు కట్ట పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 26, 2026 / 11:43 AM IST

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

BDK: త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయొచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా సుమారు 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి.

February 26, 2026 / 11:42 AM IST

ఉక్రెయిన్ కోసం అమెరికా కొత్త క్షిపణి

అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైన రస్టీ డాగర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 16 నెలల్లోనే తయారైన ఈ క్షిపణి 920 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఇలాంటి 3,000 క్షిపణులను అమెరికా పంపనుంది. ఈ క్షిపణులు యుద్ధ రంగంలో ఉక్రెయిన్ బలాన్ని భారీగా పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు.

February 26, 2026 / 11:42 AM IST

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాన్యవర్ బట్టల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భవనంలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 11:41 AM IST

ఫిబ్రవరి 28న ప్రజ్ఞ డీగ్రీ కళాశాలలో జాబ్ మేళా

E.G: బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 19 – 30 సం. వయస్సు గలవారు అర్హులన్నారు.

February 26, 2026 / 11:41 AM IST

కురిక్యాల పీఎసీఎస్ కార్యదర్శి సస్పెండ్

KNR: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ఎరువుల కొనుగోలులో అవకతవకలు, రుణాల వసూలులో పాత ఓచర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. రామడుగు కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 11:40 AM IST

స్వామివారి సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పింగళి ఉపేందర్, కందిబండ సురేష్ కలిసి లక్ష్మీనరసింహస్వామి సేవకులకు టీషర్ట్స్‌ను ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్యతో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్వామివారి సేవకులకు టీషర్ట్స్ అందజేసిన ఉపేందర్, సురేష్‌ను అభినందించినారు.

February 26, 2026 / 11:38 AM IST

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్లు పంపిణీ

కోనసీమ: ఆత్రేయపురం జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో క్షత్రియ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పరీక్ష సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ సామాగ్రిని అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ అందజేశారు. 

February 26, 2026 / 11:36 AM IST

రక్షణ చట్టం కోసం న్యాయవాదుల పాదయాత్ర

NRPT: ప్రభుత్వం రక్షణ చట్టం తేవాలని న్యాయవాదులు గురువారం నారాయణపేట జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. రేపటిలోగా న్యాయవాదుల చట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

February 26, 2026 / 11:36 AM IST

తెనాలిలో ఎడ్ల బలప్రదర్శన పోటీలకు భూమి పూజ

GNTR: తెనాలి మార్కెట్ యార్డులో మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బలప్రదర్శన పోటీలకు గురువారం భూమి పూజ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను ప్రారంభించారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 26, 2026 / 11:36 AM IST

నెల్లూరుకు చేరుకున్న జగన్

AP: మాజీ సీఎం జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకూ అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమికూడారు. వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు.

February 26, 2026 / 11:36 AM IST

ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA

HYD: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

February 26, 2026 / 11:34 AM IST

‘సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలి’

E.G: జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలని రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు.

February 26, 2026 / 11:34 AM IST