• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై ఫిర్యాదు

MNCL: కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఒడ్డెటి పద్మ-అశోక్, గ్రామస్థులు కోరారు. ఈ మేరకు SIకి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. NREGS కింద రూ. 5 లక్షల విలువగల CC రోడ్డు మంజూరు కాగా రోడ్డు పని ప్రారంభించే సమయంలో ముగ్గురు వ్యక్తులు పనులు అడ్డుకొని గొడవ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

February 26, 2026 / 09:07 AM IST

పి.కొత్తకోట సమీపంలో గుంతలమయమైన సర్వీస్ రోడ్డు.!!

CTR: బెంగళూరు-నాయుడుపేట జాతీయ రహదారిలో పి.కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపురం వద్ద సర్వీస్ రోడ్డు గుంతలతో దెబ్బతింది. మూడు నెలలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.

February 26, 2026 / 09:07 AM IST

ఉమ్మడి జిల్లా రైతులకు హెచ్చరిక..!

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఈ నెల 27వ తేదీతో ముగియనున్నట్లు ఆయా జిల్లాల మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ నిల్వలను త్వరగా విక్రయించుకోవాలని మార్కెట్ అధికారులు సూచించారు. సీజన్ ప్రారంభంలో ‘కిసాన్ యాప్’ వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 09:05 AM IST

క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

PDPL : జేఎన్‌టీయూ‌హెచ్ అనుబంధ బీ-జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్‌ను నిన్న సాయంత్రం మంథని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆవిష్కరించారు. ఈరోజు గురువారం నుంచి 12 జట్లతో లీగ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు జరుగనున్నాయి. పూర్వ విద్యార్థులు, రామగుండం క్రికెట్ అసోసియేషన్, సింగరేణి అధికారులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.

February 26, 2026 / 09:05 AM IST

అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు

WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.

February 26, 2026 / 09:04 AM IST

‘నిధితులను కఠినంగా శిక్షించాలి’

JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో రజక యువజన కమిటీ ఆధ్వర్యంలో చిన్నారి మృతి పట్ల బుధవారం కొవ్వత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.

February 26, 2026 / 09:04 AM IST

ధర్మవరం ఆర్డీవో, డీఎస్పీ బదిలీ

సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో మహేశ్, డీఎస్పీ హేమంత్ కుమార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ విజయానంద్ వీరికి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని సూచించారు. పరిపాలనా కారణాల వల్ల ఈ ఆకస్మిక బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

February 26, 2026 / 09:03 AM IST

నేడు ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం

BDK: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అందరూ సకాలంలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ సందర్శించారు.

February 26, 2026 / 09:02 AM IST

ఎల్లారెడ్డి ఆర్డీవో బదిలీ

KMR: ఎల్లారెడ్డి ఆర్డీవో కే. పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభాకర్ కొత్త ఆర్డీవోగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్‌డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

February 26, 2026 / 09:02 AM IST

ధర లభించకపోవడంతో చామంతి రైతుల ఆవేదన

ATP: శింగనమల నియోజకవర్గం నాయనపల్లి క్రాస్ రైతులు సంప్రదాయ పంటల్లో లాభాలు లేక చామంతి సాగు చేపట్టారు. విద్యుత్ బల్బుల వెలుగులో దిగుబడులు పెంచి ఆకర్షణీయమైన పూలను పండిస్తున్నారు. వీటిని బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట బాగున్నా ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 09:01 AM IST

ఇంటర్ పరీక్షల పై నిత్యం ఆకస్మిక తనిఖీలు.. తేడా వస్తే అంతే సంగతి

HYD: ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ HYD జిల్లాలో పకడ్బందీగా అధికారులు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ యాదవ్ మారేడుపల్లి సహా అనేక సెంటర్లలో తనిఖీలు చేసిన ఆయన, పరీక్షలు పూర్తయ్యే వరకు నిత్యం తనిఖీలు చేపడతానని, ఆకస్మిక తనిఖీల్లో తేడా వస్తే చర్యలు ఉంటాయన్నారు.

February 26, 2026 / 09:01 AM IST

పురిటిబిడ్డ మృతి.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

February 26, 2026 / 09:01 AM IST

కరీంనగర్ జిల్లా కలెక్టర్ బదిలీ

KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కూడా బదిలీ అయ్యారు. ఆయనను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 26, 2026 / 09:01 AM IST

హెడ్ కుక్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం

NZB :ధర్‌పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కేర్ టేకర్ స్వరూపకు అందజేయాలన్నారు. వేతనం రూ.7800 ఉంటుందన్నారు.

February 26, 2026 / 09:01 AM IST

పిచ్చి కుక్కల బెడద.. సీపీఐ హెచ్చరికలు

NDL: బనగానపల్లెలో వీధి కుక్కల దాడులతో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారని CPI మండల కార్యదర్శి శివయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కాలనీ, కరీంబాగ కాలనీల్లో పిచ్చి కుక్క దాడులకు దాదాపు 30 మంది గాయపడ్డారని బుధవారం రాత్రి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

February 26, 2026 / 09:00 AM IST