• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కమిషనర్

KRNL: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

February 25, 2026 / 09:03 AM IST

‘వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నాం’

MNCL: వాహనాదారుల్లో మార్పు కోసమే జరిమానాలు విధిస్తున్నామని మంచిర్యాల ట్రాఫిక్ CI సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జరిమానాలు విధించడం పోలీసుల లక్ష్యం కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.

February 25, 2026 / 09:03 AM IST

రిజర్వేషన్ భిక్ష కాదు.. హక్కు: సునీల్ నాయక్

AP: SC, ST విద్యార్థుల ఎంపికపై గతంలో Dy. స్పీకర్ రఘురామ చేసిన వ్యాఖ్యలను IPS సునీల్ నాయక్ తప్పుబట్టారు. ‘రిజర్వేషన్ అనేది ఛారిటీ కాదు. 2వేల ఏళ్ల చారిత్రక నేరాన్ని రాజ్యాంగం సరిదిద్దుతోంది. మేము కేవలం పరీక్షలే కాదు, మీరు నిర్మించిన శతాబ్దాల గోడలను బద్దలుకొట్టాం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఆలోచనా విధానం ఇలా ఉంటే అణగారిన పిల్లలకు ఏం సందేశం వెళ్తుంది’ అని ప్రశ్నించారు.

February 25, 2026 / 09:02 AM IST

కుమ్మెర జాతర ఘటనలో ముగ్గురు అరెస్ట్

NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1 ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి, A2 మధు రెడ్డి, A3 శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల చిన్నారి మృతదేహంపై పోస్టుమార్టం నివేదికలో అంతర్గత, బహిర్గత గాయాలు లేవని వెల్లడైంది. RFSL నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

February 25, 2026 / 09:02 AM IST

మహిళా డిగ్రీ కళాశాల అడ్మిషన్‌లు ప్రారంభం

MBNR: దొడ్డలోనిపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కొత్త విద్యార్థుల అడ్మిషన్‌లు  ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ Dr. జె.జయప్రద తెలిపారు. అభ్యర్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 09:00 AM IST

పేదింటి పెళ్లికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ నివాసి చంద్రశేఖర్ కుమార్తె వివాహానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి బుధవారం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి నగదును అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.

February 25, 2026 / 09:00 AM IST

’27న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం’

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూత్ రెడ్ క్రాస్ కమిటీ, బొల్లినేని హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.

February 25, 2026 / 09:00 AM IST

క్రమశిక్షణకు ప్రతీక రంజాన్: మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: రాయచోటిలోని పాతిమా మసీదులో YCP మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణ,సేవాభావం పెంపొందిస్తుందని కొనియాడారు. దైవచింతన వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

February 25, 2026 / 09:00 AM IST

మురుగు కూపంలో మూడు రోడ్ల కూడలి

E.G: దేవరపల్లి-గోపాలపురం మూడు రోడ్ల సెంటర్ వద్ద డ్రైనేజీ ఆక్రమణలతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దుర్వాసనతో ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు పనులు కాకుండా, ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు. మురుగునీటి సమస్యతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 09:00 AM IST

నర్సరీలను సందర్శించిన చైర్మన్ రాఘవరెడ్డి

HNK: అశ్వరావుపేట, దమ్మపేట, కల్లూరి గూడెం ప్రాంతాలలో ఆయిల్ ఫామ్ నర్సరీలను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పరిశీలించారు. నాణ్యమైన మొక్కలను రైతులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని, ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

February 25, 2026 / 08:59 AM IST

తెలుగు రాష్ట్రాల యువతకు గుడ్‌న్యూస్

ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువతకు భారత వాయుసేన గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నివీర్ వాయు నియామకాలకు గుంటూరులోని నాగార్జున వర్సిటీలో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. MAR 9, 10న మహిళా అభ్యర్థులకు, 12, 13న AP పురుష అభ్యర్థులకు, 15, 16న TG పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా అభ్యర్థులు నేరుగా పాల్గొనవచ్చు.

February 25, 2026 / 08:59 AM IST

కుమార్తెను హత్య చేసిన తల్లి

TPT: తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాల భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గతో కలిసి ఉంటుంది. చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు కనబడుటలేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

February 25, 2026 / 08:58 AM IST

ప్రశాంతి నిలయంలో ‘బాయ్ తీ కాంగ్’ వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ‘బాయ్ తీ కాంగ్’ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జేడ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చైనా భక్తులు ఈ సంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బియ్యం కేకులు, అగరుబత్తులు, దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు.

February 25, 2026 / 08:56 AM IST

“వెంటనే మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మత్తులు చేపట్టాలి”

MLG: మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీక్ అవుతున్న విషయం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా భారీగా నీరు బయటకు వస్తున్నా, సంబంధిత అధికారులు మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.

February 25, 2026 / 08:54 AM IST

‘NTRNeel’ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టు ‘NTRNeel’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ SMలో వైరలవుతోంది. మార్చి నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో NTRపై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ కూడా షూట్ చేయన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ NTR కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.

February 25, 2026 / 08:53 AM IST