• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపికకు దరఖాస్తులు’

PDPL: పెద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకంలో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. మార్చి 25 లోగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 05:02 PM IST

‘ఇంజనీరింగ్ కళాశాలలా అప్‌గ్రేడ్ చేయాలి’

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రూ.6 కోట్లతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అప్‌గ్రేడ్ కు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 05:02 PM IST

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ అవగాహన కార్యక్రమం

KNR: గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజస్ట్రీని ఫిబ్రవరి 28లోగా నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గోపి చంద్, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు.

February 26, 2026 / 05:02 PM IST

‘పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి’

SRPT: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేసి మాట్లాడారు. సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు.

February 26, 2026 / 05:02 PM IST

రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక

TG: ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. ఇవాళ సచివాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావిధానం పైన ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ’ పేరుతో ఉన్న నివేదికను సీఎంకు అందజేశారు.

February 26, 2026 / 05:02 PM IST

ఇంటికే భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు

ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 05:02 PM IST

నాగోబా ఆలయంలో షూటింగ్‌లపై నిషేధం

ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో నూతన వధూవరుల ఫొటో షూటింగ్‌లకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గతంలో షూటింగ్‌లకు అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది నుంచి నాగోబా దేవస్థానంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయరాదని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

February 26, 2026 / 05:02 PM IST

డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన MLA

ASF: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి గురువారం ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

February 26, 2026 / 05:01 PM IST

T20 WC: వెస్టిండీస్ అరుదైన రికార్డు

వెస్టిండీస్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్లు హోల్డర్(49), షెపర్డ్(52*) 8వ వికెట్‌కు 89 పరుగులు జోడించారు. దీంతో T20Iల్లో 8వ వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ICC ఫుల్ మెంబర్ టీమ్‌గా WI రికార్డు సృష్టించింది. అదేవిధంగా 7 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధికంగా 93 పరుగులు చేసిన జట్టుగా కూడా నిలిచింది.

February 26, 2026 / 05:00 PM IST

‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్‌కు టైం ఫిక్స్

టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘రూబారూ’ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయింది. FEB 27న సాయంత్రం 6:03 గంటలకు ఈ పాట రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 26, 2026 / 05:00 PM IST

ఆలయ భూములకు వేలం ఖరారు

AKP: నాతవరం శ్రీగంగాదేవి, నూకాలమ్మ తల్లి ఆలయాల 13 ఎకరాల వ్యవసాయ భూముల పంట కౌలకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం జరిగింది. 11 మంది పాటదారులు పాల్గొన్న ఈ వేలంలో గవిరెడ్డి సత్యనారాయణ రూ.1.48 లక్షలకు పాటను పొందారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, ఈవో సాంబశివరావు పాల్గొన్నారు.

February 26, 2026 / 04:56 PM IST

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

SRPT: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు.

February 26, 2026 / 04:55 PM IST

వాహనాల పార్కింగ్‌కు స్థల పరిశీలన

CTR: మార్చి నెలలో పుంగనూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

ఊట్ల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామ ప్రభుత్వ పాఠశాలను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల పాఠశాలను పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

డూప్లికేట్ గాంధీలు ఉన్నారు: KTR

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని.. ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదేనన్నారు. శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్లు.. 4000 మంది పోలీసులతో పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై మంత్రులు కన్నేశారన్నారు.

February 26, 2026 / 04:55 PM IST