• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మరణించిన కూడా ఇద్దరికీ చూపు

ATP: నార్పలకు చెందిన సత్యనారాయణమ్మ బుధవారం కన్నుమూశారు. మరణానంతరం ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శివన్న, నాగరాజు సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు నేత్రాలను అందజేశారు. గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ సంస్థ ప్రత్యేకంగా అభినందించారు.

February 25, 2026 / 02:14 PM IST

వాడపల్లి వెంకన్న ఆలయానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వెలిచేరుకు చెందిన నల్లం వెంకట్రామారావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 25, 2026 / 02:13 PM IST

పులి సునీల్‌ను పరామర్శించిన మాజీ సీఎం జగన్

KDP: గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. మేయర్ సురేష్‌కు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా సునీల్ కుమార్‌ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.

February 25, 2026 / 02:12 PM IST

ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్

JGL: మల్యాల మండలం నూకపల్లి సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూకపల్లి సర్పంచ్‌గా గెలిపిస్తే పదవిలో ఉన్నంతకాలం గ్రామంలో జరిగే ప్రతి ఆడపడుచు పెళ్లికి రూ.5వేలు ఇస్తానని ప్రకటించారు. ఆయన గెలిచిన తర్వాత గ్రామంలో జరిగిన మొదటి ఆడపడుచు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

February 25, 2026 / 02:12 PM IST

ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

GNTR: మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి.

February 25, 2026 / 02:10 PM IST

‘జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు’

కోనసీమ: ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని చిన్ని గంగాధరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నుండి టీడీపీలో చేరితే అది జీర్ణించుకోలేని వీరబాబు బూటకపు చేరికలని అనటం విడ్డూరం అని అన్నారు.

February 25, 2026 / 02:09 PM IST

శ్రీవిష్ణు కోసం రామ్ పోతినేని..!

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ మూవీలోని ‘హే జిందగీ’ పాటను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విడుదల చేయనున్నాడు. ఇక దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది.

February 25, 2026 / 02:09 PM IST

కోయిలకుంట్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 25, 2026 / 02:08 PM IST

కోకో పంటలో తెగులుపై రైతులకు అవగాహన

ELR: కోకో చెట్లకు వివిధ శిలీంద్రాలు తాకిడి వలన పూత, పిందెపై తీవ్ర ప్రభావం ఉందని ఉద్యాన అధికారి అమర్నాథ్ అన్నారు. ఉంగుటూరు(M) యర్రమిల్లిపాడులో రైతులకు కోకో పంటలో వివిధ తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాజేష్,  రైతులు, పాల్గొన్నారు.

February 25, 2026 / 02:08 PM IST

సీఎంను కలిసిన సత్యసాయి జిల్లా నేతలు

సత్యసాయి: CM చంద్రబాబు నాయుడును బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతిలో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు.

February 25, 2026 / 02:07 PM IST

నారాయనగూడా-హిమాయత్‌నగర్ వైపు ట్రాఫిక్ జామ్

HYD: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ వైపు వాహనాల రాకపోకలు మందగించాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. వాహనదారులు ముందుగానే బయలుదేరి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

February 25, 2026 / 02:05 PM IST

వెలుగొండ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పర్యటన

AP: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లెకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారులతో కలిసి కెనాల్ వెంట నడిచి పరిశీలించారు. పనుల నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 01:52 PM IST

23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు బంగ్లా జట్టు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. రెండు టెస్టుల ఈ సిరీస్ 2026-27 ఆసీస్ హోమ్ సీజన్‌కు ఆరంభం కానుంది. గతంలో 2017లో మీర్పూర్‌లో ఆసీస్‌ను ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తలపడనుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 25, 2026 / 01:51 PM IST

‘పరీక్షల వేళ విద్యార్థులకు బైకు ఇవ్వొద్దు’

MDK: ఇంటర్మీడియట్ విద్యార్థుల భద్రత దృష్ట్యా పోలీసులు కీలక సూచనలు చేశారు. మైనర్లు, లైసెన్స్ లేని విద్యార్థులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 25, 2026 / 01:48 PM IST

‘శ్రీనివాస మంగాపురం’ క్రేజీ UPDATE

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు.

February 25, 2026 / 01:47 PM IST