ప్రకాశం: మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.
జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ అతిథి పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ సన్నివేశంలో అఖిల్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
VKB: TGBIE స్టూడెంట్స్ & పేరెంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు వంటి అంశాలపై మార్గదర్శనం, సందేహాలు నివృత్తి కోసం విద్యార్థులు కాల్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24655027, IVR 9240205555. విద్యార్థులు అవసరమైన సాయం కోసం వెంటనే సంప్రదించవచ్చని సూచించారు.
NDL: బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామ శివారులో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు 4-5 బ్లాకుల మధ్య భారీ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇటీవలే సమీపంలో గండి పూడ్చినప్పటికీ మళ్లీ గండి పడటంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
TPT: సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ హాజరై ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు, వాటి నుంచి రక్షణ మార్గాలపై సూచనలు ఇచ్చారు. “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”, వాహన భద్రత, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే శక్తి యాప్ గురించి వివరించారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్‌కు నేతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, చిన్న వ్యాపార సంఘం కార్యదర్శి తిమ్మప్ప మాట్లాడుతూ.. చిన్న వ్యాపారస్తుల కడుపు కొట్టే సుంకం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీని సుంకం గెజిట్ ప్రకారం వసూలు చేయాలన్నారు.
AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
AP: తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాపై బాధ్యతగా ఉండాలని, అవసరమైతే టాటా, రిలయన్స్ సంస్థల సహకారం తీసుకోవాలని బీజేపీ MLC సోము వీర్రాజ్ సూచించారు. ‘వైసీపీ వాళ్లు 420 కాబట్టే నెయ్యిని 320కి కొన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో రూ.2 వేల వరకు ఉంటుంది. లడ్డూలో వాడేది అసలు నెయ్యి కాదు. తిరుమలలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ.. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ తయారు చేయాలి’ అని పేర్కొన్నారు.
RR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కేఎల్‌ఆర్ దంపతులను ఆహ్వానించారు. కాసేపు నియోజకవర్గ అభివృద్ధిపై ముచ్చటించారు.
AP: మద్యం కేసులో నిందితులను శిక్షించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. స్కామ్‌లో ఎంతటివారైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో 200 ఆలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అన్యమతస్తులకు తిరుమలలో భూములు కేటాయించారని తెలిపారు. లడ్డూ కల్తీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
కామారెడ్డి పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను SP రాజేశ్ చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.
తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.
సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వాటిని సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.