PPM: గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ ఉండాలని DMHO డా. ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియెంటేషన్ శిక్షణను ఎన్జీఓ హోంలో బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అనుబంధ అర్మాన్ స్వచ్ఛంద సంస్థ నుండి డా. కె. విద్యాసాగర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
AKP: సీతపాలెంలో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు బుధవారం ఆందోళన చేశారు. ఫార్మా పరిశ్రమల వల్ల వాయు,జల కాలుష్యం పెరిగి 20 వేల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సెజ్లోని కంపెనీల వ్యర్థాలతో మత్స్య సంపద దెబ్బతిందని వాపోయారు. తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి శంకుస్థాపన నిలుపుదల చేయాలన్నారు.
TG: MLA కౌశిక్ రెడ్డిపై పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సీపీ మతమార్పిడులు చేస్తున్నారని కౌశిక్ అనలేదని తెలిపారు. సీఐడీ దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ వస్తు సామగ్రిని అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వార్డ్ కౌన్సిలర్ ఉదరి యాదయ్య పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు వాసి నాగర్జున NCTE అమలు చేస్తున్న జాతీయ మెంటరింగ్ మిషన్ NMMలో మెంటర్‌గా అధికారికంగా బుధవారం ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రారంభించిన ఈ మిషన్ లక్ష్యం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు అకాడెమిక్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం కోసం రూపొందించబడింది. ఈ సందర్బంగా నాగార్జునకు పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
VZM: విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడిన గుమ్మడి ఆదినారాయణను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని, కోర్టు ఆదేశాలతో వాహనాలను బాధితులకు అప్పగిస్తామని చెప్పారు.
GNTR: వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉత్సాహంగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మహిళా మంత్రులు స్టాళ్ల వద్ద సందడి చేశారు. నేతన్నల ఉత్పత్తులకు ప్రజాప్రతినిధుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.
NZB: జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ నిజామాబాద్‌లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
PDPL: మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పెద్దపల్లి డీజీపీ రామ్ రెడ్డి సూచించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వేగ పరిమితులను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 34వ వార్డు మార్కండేయ నగర్‌లో నూతన రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు బుధవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో హిందూపురం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు.
VZM: నెల్లిమర్ల ఈవిఎం గోదాములను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమేరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్తితులను పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాల...
MDCL: మల్కాజ్‌గిరి జోన్ అల్వాల్ పరిధిలోని డివిజన్లు 190, 191లలో సివిల్ పనులు, పార్కుల అభివృద్ధిపై జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్‌ను ఈరోజు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రతిపాదనలపై స్పందించిన కమిషనర్ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
SRPT: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో 88.44 శాతం పురోగతి సాధించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రూ.11,919 కోట్ల లక్ష్యానికి గాను రూ.10,541 కోట్లు ప్రజలకు అందించామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 96 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సీతారామారావు ఉన్నారు.
BPT: చీరాల పోలీసులు మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. బాపట్లను డ్రగ్స్ రహిత (నషా ముక్త్) జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.
TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.