GNTR: తెనాలిలో శనివారం రాత్రి జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైనా సహజ మరణం పొందితే వారి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో పవన్ కళ్యాణ్ తరపున రూ. 50 వేలు, స్థానిక నాయకత్వం ద్వారా మరో రూ. 50వేలు అందజేస్తామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
PLD: నరసరావుపేటలో ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 వరకు, స్కిన్‌తో ఉన్న చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 240 వరకు ఉంది. ఇక లైవ్ కోడి రూ. 140కి, పెద్ద బాయిలర్ రూ. 260 నుంచి రూ. 280కి లభిస్తున్నాయి. అలాగే మటన్ ధర రూ. 850 నుంచి రూ. 1000 వరకు ఉండగా, 100 కోడిగుడ్ల ధర రూ. 500గా ఉంది. ప్రాంతాలను బట్టి […]
SKLM: జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.170, విత్ స్కిన్ రూ.220, స్కిన్ లెస్ రూ.260గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నా యని విక్రయదారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం వినియోగదారులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి.
KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో మనేకుర్తిలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు నేరుగా తెలిపారు. కొన్నింటిని అక్కడే పరిష్కరించారు, మిగతా సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని, సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామంలో శనివారం రాత్రి ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలపై అవగాహన నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
HYD: కోకాపేటలోని శారదా పీఠం భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి చేసిన కేటాయింపులను రద్దు చేస్తూ, ఆ భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. నిర్మాణాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మంత్రి శ్రీధర్ బాబును కలవాలని పీఠం ప్రతినిధులకు సూచిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిమిత్తం ఆమె ఇంగ్లాండ్ వెళ్తుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’ అని సోషల్ మీడియాలో సింధు పేర్కొంది.
MNCL: స్కిల్ ఇండియా పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థి ఎర్రం శ్రీరామ్ ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లో జరిగిన దేశవ్యాప్త స్కిల్ డెవలప్మెంట్‌కు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున వడ్రంగి రంగంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీరామ్ ప్రథమ స్థానంలో విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి వివేక్ ప్రశంస పత్రంతో శ్రీరామ్‌ను సత్కరించారు.
విశాఖలో మాంసం దుకాణాల వద్ద ఆదివారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో ఈ రోజు కేజీ మటన్ రూ.1000లకు విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ రూ.280, చికెన్ లైవ్ రూ.185, సొంట్యాం రూ.320, గుడ్లు డజను రూ.70లుగా ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతకు అమ్ముతున్నారో కామెంట్ చేయండి.
MDK: పట్టణంలోని పిట్లంబేస్ వీధిలో ఈ నెల 9న మహ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై దాడికి యత్నించి, భయబ్రాంతులకు గురిచేసిన కేసులో మల్లికార్జున్ గౌడ్ సహా మరికొందరిని శనివారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకే ఈచర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ అరెస్టులు కేవలం సదరు దాడి కేసు విచారణ కోసమేనని, ఎమ్మెల్యేపై దాడికి సంబంధం లేదని తెలిపారు.
TPT: ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.ఆర్.టీ.నం.494 ప్రకారం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అయితే సాయి ప్రసాద్‌కు వాటర్ రిసోర్సెస్, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూరి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముద్దాడ రవిచంద్ర టీటీడీ పూర్తి బాధ్యతలను స్వీకరించారు.
ATP: రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (ఏపీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నాలుగు రకాల పథకాలకు అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య శనివారం ఓ ప్రక టన విడుదల చేశారు. ఈనెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
KRNL: బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మంత్రి బీసీ జనార్దన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగ-ఉపాధి వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.
SKLM: నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శరత్‌ను విధుల నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంఛార్జ్ ఈఈ కమలాకర్‌తో పాటు మరికొందరికి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు.
BDK: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చి, తరువాత ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం పూర్తయ్యాక శుద్ధి పూజల అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.