• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి’

W.G. బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి అంటూ మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి గ్రామానికి చెందిన అందె మీనాక్షి అనే విద్యార్థిని చదువుకు అవసరమైన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతోంది అని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమెను సోమవారం తణుకు నివాసానికి పిలిపించి ఆమెకు కావాల్సిన పుస్తకాలను స్వయంగా అందించారు.

February 23, 2026 / 03:51 PM IST

కల్తీ పాలు అని ఎలా తెలుసుకోవాలి..?

AP: రాజమండ్రిలో కల్తీపాల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పాలు కల్తీ జరిగిందని డౌట్ వచ్చినప్పుడు.. కొద్ది పాలను అరచేతిలో వేసి రుద్దాలి. ఎక్కువగా నురగా వచ్చినా.. లేదా చేదుగా అనిపించినా అవి కల్తీ జరిగినట్లే. అంటే ఇందులో యూరియా, డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా వంటివి కలిపారని అర్థం. ఒకవేళ పాలు తాగిన తర్వాత ఎవరికైనా మూత్రం సరిగా రాకపోతే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి.

February 23, 2026 / 03:50 PM IST

సఫారీలకు ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్‌లా..?

అహ్మదాబాద్ స్టేడియంలో భారత్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో ఇదే స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడింది. దీనివల్ల పిచ్ పరిస్థితులపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఏర్పడింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. దీంతో, ‘సౌతాఫ్రికా ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్‌లు ఆడేలా ICC షెడ్యూల్‌ను ఎలా రూపొందించింది?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

February 23, 2026 / 03:50 PM IST

అంగన్వాడి వర్కర్లు రిలే నిరాహార దీక్ష

CTR: అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, CITU, IFTU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో నగరిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ.. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:49 PM IST

కావేరి ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కి జైలు శిక్ష

TPT: శ్రీకాళహస్తి SDPO నరసింహమూర్తి ఆధ్వర్యంలో, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి తనిఖీల సమయంలో, కావేరి ట్రావెలకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఎం.జానయ్య అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు 12 రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

February 23, 2026 / 03:47 PM IST

‘బీసీ భవనానికి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టాలి’

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లోనే వేగవంతంగా ప్రారంభించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అసెంబ్లీలో కోరారు. వెలగపూడిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో “బీసీ సంక్షేమం”పై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు.

February 23, 2026 / 03:46 PM IST

BREAKING: భారీ వర్షం

TG: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోనూ పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. కాగా, ఆకాశం మేఘావృతం అయింది.

February 23, 2026 / 03:46 PM IST

మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు

WNP: మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజు వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు.

February 23, 2026 / 03:46 PM IST

అనారోగ్యానికి గురైతే ఫోన్ చేయండి: కలెక్టర్

తూ.గో: రాజమహేంద్రవరంలోని లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద పాలు సేకరించి 106 కుటుంబాలకు పోశాడన్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే కాల్ సెంటర్‌కు (94940 60060)ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

February 23, 2026 / 03:45 PM IST

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మహిళా గ్రామైక్య సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడారం వీర్ పాల్, ఎంపీడీవో సుమలత టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఐకేపీ ఎపీఎం, మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:44 PM IST

అనారోగ్యానికి కల్తీ పాలే కారణం: సత్యకుమార్

తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన మరణాలు, అనారోగ్య ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించి 106 కుటుంబాలకు పాలు సరఫరా అయినట్లు గుర్తించామని, ఇప్పటికే ఆయా కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అనారోగ్యానికి కల్తీ పాలే కారణమని వెల్లడించారు.

February 23, 2026 / 03:43 PM IST

కాల్వ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి

SRCL: తంగళ్లపల్లి మండలంలోని కాలేశ్వరం ప్రాజెక్టు ఎల్‌ఎంసీ 11/6, 11/5, 11/4 కాల్వల పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జ్యోతి అనిల్, అంచ శ్రీనివాస్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:43 PM IST

సీసీ కెమెరాల నిఘాలో YVU పీజీ పరీక్షలు

కడప: ప్రొద్దుటూరు కేంద్రాలుగా వైవీయూ పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలయ్యాయి. వైవీయూ క్యాంపస్‌లో జరుగుతున్న పరీక్షలను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ గది నుంచి సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించారు.

February 23, 2026 / 03:43 PM IST

రేపు కుమ్మెరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.

February 23, 2026 / 03:42 PM IST

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

MDCL: అల్వాల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి దేవతారాధన విశేష అభిషేకాలు చేసిన, ఆలయ కమిటీ సభ్యులు చివరి రోజు మంగళవారం మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సంప్రోక్షణ, తీర్థ ప్రసాద, మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

February 23, 2026 / 03:41 PM IST