• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గంగ-కావేరి అనుసంధానం నా కోరిక: చంద్రబాబు

AP: నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం చేయాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని తెలిపారు. గంగ-కావేరి అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని వెల్లడించారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు.

February 26, 2026 / 01:56 PM IST

కిర్లంపూడి ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా సాయి బాధ్యతలు

KKD: కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సాయి కిరణ్ గురువారం మండల మెజిస్ట్రేట్‌గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

February 26, 2026 / 01:54 PM IST

నేను ఉత్తమ్ అంత సౌమ్యుడిని కాదు: కౌశిక్ రెడ్డి

TG: మంత్రి ఉత్తమ్ కుమార్‌ను తొక్కినట్లు నన్నూ తొక్కాలనుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనను తొక్కడం రేవంత్ వల్ల కాదన్నారు. తాను ఉత్తమ్ కుమార్ అంత సౌమ్యుడిని కాదని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చూసుకుంటానని హెచ్చరించారు.

February 26, 2026 / 01:53 PM IST

ఆ దేవుడు మిమ్మల్ని క్షమించరు: బొత్స

AP: లడ్డూ కల్తీపై కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘దేవదేవుడికి అపచారం చేసిందే కూటమి ప్రభుత్వం.  లడ్డూ కల్తీపై చర్చకు ఎందుకు పారిపోతున్నారు. ఇప్పుడు మీరు పారిపోవచ్చు.. ఆ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించరు. చర్చ జరిగితే హెరిటేజ్‌పై నిజాలు బయటకు వస్తాయని భయపడ్డారు’ అని విమర్శించారు.

February 26, 2026 / 01:51 PM IST

స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో కమిషనర్ పర్యటన

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక 6వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో పర్యటించారు. ఒక భవనానికి సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్, టౌన్ ప్లానింగ్ నిర్మాణ అనుమతులను పరిశీలించారు. ఎండ్ టు ఎండ్ సి.సి రోడ్డు నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో, నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు.

February 26, 2026 / 01:51 PM IST

కుస్తీ పోటీలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతి

NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డు పరిధిలో హోలీ సందర్భంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన నిర్వహించే కుస్తీపోటీలకు బందోబస్తు నిర్వహించాలని పట్టణ సీఐ వెంకట నారాయణకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెల్లా శంకర్, పడాల భీములు, గుమ్ముల శంకర్ రెడ్డి, పాల్గొన్నారు.

February 26, 2026 / 01:50 PM IST

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: కోమటిరెడ్డి

TG: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. వైద్య విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.

February 26, 2026 / 01:48 PM IST

ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే..

BHPL: కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు.

February 26, 2026 / 01:48 PM IST

వరి పంటలపై ఏవో హెచ్చరిక

BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి కళ్యాణి వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణంలో అగ్గి తెగులు, కాండం పురుగు ఉధృతి పెరుగుదలతో తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి తగ్గే అవకాశముందని గుర్తించారు. రైతులు తగిన మందులు సమయానికి పిచికారీ చేసి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏవో సూచించారు.

February 26, 2026 / 01:47 PM IST

వరుస నష్టాలతో రైతులు కుంగుబాటు

KDP: వ్యవసాయ దొంగతనాలు కమలాపురం(మం) రైతులను కలవరపెడుతున్నాయి. బోర్ల మోటార్లు, స్టార్టర్లు, కాపర్ వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. వరుస నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు.

February 26, 2026 / 01:43 PM IST

లైబ్రరీ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన నాయకులు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.

February 26, 2026 / 01:42 PM IST

‘రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్’

AP: జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ మొదలు పెట్టారని తెలిపారు. మట్టి పనులు చేసి రూ.800 కోట్లు దోచుకున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి కంపెనీకి జగన్.. పాలమూరు- రంగారెడ్డి టెండర్లు ఇప్పించారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ అని మండిపడ్డారు.

February 26, 2026 / 01:42 PM IST

పెద్ద రేవల్లి స్టోన్ కంపెనీపై ఫిర్యాదు

MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో శ్రీ తిరుమలనాథ దేవస్థానం సమీపంలో స్టోన్ కంపెనీ దుమ్ము కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి మూగజీవాలు చనిపోతున్నాయి. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 01:41 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

HNK: ఎల్కతుర్తి మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని MGM ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 01:41 PM IST

‘ఏడుకొండలకు మెరుగైన వైద్యం అందించాలి’

PLD: గురజాల మండలం దైద అడ్డరోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న తేలుకుట్ల గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీకి చెందిన నేతలు రాడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులో చికిత్స పొందుతున్న ఏడుకొండలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 01:41 PM IST