• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి’

AP: విశాఖలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరఫీ సెకండ్ ఇయర్ చదువుతున్న రజిని అనే విద్యార్థిని ప్రేమించిన యువకుడు వదిలేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. అతన్ని మర్చిపోలేకపోతున్నా’ అంటూ లెటర్‌లో పేర్కొంది.

February 26, 2026 / 11:24 AM IST

నెల్లూరు మేయర్ ఎన్నికకు వైసీపీ దూరం

NLR: నెల్లూరు మేయర్ ఎన్నికకు YCP కార్పొరేటర్లు దూరమయ్యారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతోనే కౌన్సిల్ సమావేశానికి ఎవరు హాజరు కాలేదని సమాచారం. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు గురువారం జగన్ వచ్చారు. కార్పోరేటర్లు అందరూ ఆయన వద్దకు వెళ్లారు. మరోవైపు టీడీపీ కార్పొరేటర్ అందరూ సమావేశానికి వచ్చారు.

February 26, 2026 / 11:24 AM IST

రేపు ఘనంగా “వీర జవాన్” విగ్రహావిష్కరణ

VKB: దాదాపూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల తోకని శ్రీనివాస్, దేశ రక్షణలో అమరుడైనందున ఆయనకు అంకితంగా “వీర జవాన్” విగ్రహాన్ని రేపు ఉదయం 11:30 గంటలకు దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దోమ సర్పంచ్ శివకుమార్ పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘనంగా హాజరుకావాలని ఆహ్వానించారు.

February 26, 2026 / 11:23 AM IST

లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా కీమ్యా నాయక్

WNP: జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సేవలందించిన ఆయనను, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కేటాయించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. త్వరలోనే తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

February 26, 2026 / 11:22 AM IST

ధరూర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సత్కారం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ ధరూర్ పాఠశాలలో హెడ్మాస్టర్ ప్రతాప్ రెడ్డి ఫిజికల్ సైన్స్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల సమిష్టి కృషి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్ బోధనలో నాణ్యత పెంచేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు ప్రశంసించారు.

February 26, 2026 / 11:22 AM IST

గాంధీ ఓపీ బ్లాక్ వద్ద క్యాంటీన్ లేక ఇబ్బందులు

HYD: నిత్యం వేలాది మంది పేషెంట్లు, సహాయకులు, సందర్శకులు వచ్చే గాంధీ ఆస్పత్రి ఓపి బ్లాక్ వద్ద క్యాంటీన్ లేకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న క్యాంటీన్ 2 నెలల క్రితం కోర్టు ఆదేశాలతో మూతపడింది. దాంతో ఓపీ బ్లాక్ ఆవరణలో కనీసం టీ, టిఫిన్, నీరు కరవైంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు రోడ్డు దాటి బయటకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.

February 26, 2026 / 11:21 AM IST

కోటిమంది మహిళ కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి

MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వ్యాయాయంతో నిర్మించనున్న సమావేశ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

February 26, 2026 / 11:21 AM IST

జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.

February 26, 2026 / 11:20 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.

February 26, 2026 / 11:20 AM IST

పులివెందుల సీఐ ఇంట్లో భారీ నగదు

KDP: ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 11:20 AM IST

‘పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలి’

GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్’ గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్‌గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.

February 26, 2026 / 11:19 AM IST

BREAKING: భూకంపం.. భయాందోళనలో ప్రజలు

TG: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలకు 35 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

February 26, 2026 / 11:19 AM IST

చందోలు యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్  సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

February 26, 2026 / 11:16 AM IST

స్టువర్టుపురంలో నాటు సారా పట్టివేత

BPT: వేదుళ్లపల్లి పరిధిలోని స్టువర్టుపురంలో ఎస్సై భాగ్యరాజు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మన్యం లక్ష్మి అనే వ్యక్తి నుంచి 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని ఎస్ఐ సూచించారు.

February 26, 2026 / 11:16 AM IST

చిరంజీవితో ఇలాంటి సినిమా సాహసమే: పరుచూరి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్‌లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.

February 26, 2026 / 11:15 AM IST