• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

KMR: మద్నూర్ మండలంలో వెంటనే శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో 8,500 ఎకరాల్లో సాగైన పంట ప్రస్తుతం చేతికి రావడంతో ఆరబెడుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతోందని, పంట నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యమైతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

February 25, 2026 / 10:42 AM IST

డిఫరెంట్‌ లుక్‌లో శర్వానంద్‌

హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న మూవీ ‘భోగి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 28న రిలీజ్ కానుంది.

February 25, 2026 / 10:42 AM IST

మల్లన్నను దర్శించుకున్న పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి

SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 10:42 AM IST

ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు

ASF: కెరమెరి మండలంలోని 31 గ్రామాల్లో 623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, గృహాలతో పాటు తప్పనిసరిగా టాయిలెట్లు నిర్మించుకోవాలని MPDO సురేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనలో భాగంగా ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

February 25, 2026 / 10:41 AM IST

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలోని 15 ఏపీ మోడల్‌ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.

February 25, 2026 / 10:40 AM IST

అకాల వర్షాలకు దెబ్బ తిన్న మొక్కజొన్న

PPM: అకాల వర్షం కారణంగా సాలూరు మండలం కొత్తవలస, మరిపల్లి, కందులపదం, కురుకుట్టి, మమడిపల్లి, తదితర రైతు సేవాకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురి అయిందని మండల వ్యవసాయ అధికారి శిరీష తెలిపారు. పై గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సంబంధించి 60 ఎకరాల పంట అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.

February 25, 2026 / 10:38 AM IST

ఇంద్రగంటి టిపికల్‌ లవ్‌స్టోరీలో రోషన్?

‘ఛాంపియన్’ ఫేమ్ రోషన్.. దర్శకుడు శైలేష్ కొలనుతో ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో రోషన్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇంద్రగంటి శైలిలో టిపికల్ లవ్‌స్టోరీ కథాంశంతో రాబోతున్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

February 25, 2026 / 10:37 AM IST

కుమార్తెను హత్య చేసిన తల్లి, ప్రియుడు

AP: తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. దుర్గను తల్లి ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమారే హతమార్చినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం తిరుపతి బ్లిస్ కూడలిలో అదృశ్యం కేసు నమోదైంది. తన కుమార్తె అదృశ్యమైందని తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో చిన్నారి తల్లి, ఆమె ప్రియుడిని విచారించగా తామే హత్య చేసి మృతదేహాన్ని స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు.

February 25, 2026 / 10:36 AM IST

కక్షిదారులకు లోక్ అదాలత్ సువర్ణ అవకాశం

WNP: మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ వివాదాల పరిష్కారానికి ఒక మంచి అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. మంగళవారం కోర్టు ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీపడదగిన క్రిమినల్, యాక్సిడెంట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె సూచించారు.

February 25, 2026 / 10:35 AM IST

గోశాలకు పశుగ్రాసం వితరణ

RR: ఫరూక్‌నగర్ మండలం సోలీపూర్ గ్రామ శివారులోని చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి గోశాలకు కమ్మ సమైక్య వేదిక ఉపాధ్యక్షులు ఆనందరావు రూ. పదివేల విలువచేసే పశుగ్రాసం (కుట్టి) వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సమైక్య వేదిక అధ్యక్షులు సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఆనందరావు పాల్గొన్నారు. గోశాలలో ఉండే గోవుల కోసం తమవంతుగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

February 25, 2026 / 10:35 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు పదోన్నతులు

ఉమ్మడి WGL జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు మంజూరు చేసింది. నలుగురు డిప్యూటీ CEOలు CEOలుగా పదోన్నతి పొందారు. HNK ZP డిప్యూటీ CEO రవి, JN DRDO వసంత, JN ZP డిప్యూటీ CEO సరిత, హసన్పర్తి ETC ప్రిన్సిపల్ కౌసల్య దేవి ఈ జాబితాలో ఉన్నారు. అదే విధంగా ఐదుగురు MPDOలు డిప్యూటీ CEOలుగా పదోన్నతి పొందారు.

February 25, 2026 / 10:33 AM IST

పారిశుధ్య కార్యాక్రమాన్ని పర్యవేక్షించిన ఈఓ

VZM: మెరకముడిదాం మండలం గర్భాంలో పంచాయతీ EO విశ్వనాథం పర్యవేక్షణలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలో రోజువారి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చెత్త కుప్పలను ఎత్తివేసి టాక్టర్‌ సహాయంతో డంపింగ్‌ యార్డ్‌కి తరలించారు. రోడ్లపై చెత్త వెయ్యరాదని పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు చెత్తని అందించాలని EO సూచించారు.

February 25, 2026 / 10:31 AM IST

కాప్రా PHMC సర్కిల్ పరిధిలో రూ.33 కోట్ల పన్ను వసూలు

MDCL: కాప్రా GHMC సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు పురోగమిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.33 కోట్ల మేరకు పన్ను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.72.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.

February 25, 2026 / 10:31 AM IST

ఎర్రబెల్లి జాతర స్టాళ్లకు రేపు బహిరంగ వేలం

NLG: ఎర్రబెల్లిలో వెలిసిన శ్రీ మాణిక్యాలదేవి సమేత లింగమంతుల స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా రేపు వివిధ విక్రయాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే స్టాళ్లకు ఈ వేలం ఉంటుందని దేవస్థాన కమిటీ ఛైర్మన్ మన్నెం వెంకన్న తెలిపారు.

February 25, 2026 / 10:30 AM IST

శిఖర్ ధావన్‌కు బిగ్ రిలీఫ్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట లభించింది. భరణంగా ధావన్ ఇచ్చిన దాదాపు రూ. 5.72 కోట్ల తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

February 25, 2026 / 10:30 AM IST