• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

KMRL బిచ్కుంద పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. Lనిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.

February 25, 2026 / 01:06 PM IST

‘ఉపాధి హామీ పనులను ప్రారంభించండి’

KRNL: ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

February 25, 2026 / 01:05 PM IST

సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి పరిస్థితి విషమం

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గు సైడ్ ఫాల్ కావడంతో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నడుము, కాలికి దెబ్బలు తగలడంతో వెంటనే గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYDకు తరలించారు. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.

February 25, 2026 / 01:05 PM IST

చిన్నారి పునర్వికకు సాయం అందజేత

నంద్యాల చిన్నారి పునర్విక వైద్యం కోసం ప్రధాని సహాయ నిధి నుంచి రూ.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందని ఎంపీ డా.బైరెడ్డి శబరి ఇవాళ తెలిపారు. ప్రజా దర్బార్‌లో తల్లిదండ్రుల విజ్ఞప్తిని వినడం ద్వారా ఈ సహాయం సాధ్యమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పునర్విక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు.

February 25, 2026 / 01:05 PM IST

‘వార్డు సభ్యులు అవగాహన పెంచుకోవాలి’

ADB: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించాలని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలను అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక అతిముఖ్యమన్నారు.

February 25, 2026 / 01:05 PM IST

పూతలపట్టులో బ్రిడ్జ్‌లు నిర్మించండి: ఎమ్మెల్యే

CTR: పూతలపట్టులో బ్రిడ్జిలు లేక పలువురు మృతి చెందినట్లు ఎమ్మెల్యే మురళీ మోహన్ అసెంబ్లీలో తెలిపారు. భీమా నదిపై బ్రిడ్జి కొట్టుకెళ్లగా, పలు ప్రాంతాల్లో రిపేర్లు చేసిన బ్రిడ్జిలు వర్షాలకు దెబ్బతింటున్నాయన్నారు. ఐరాల MRO కార్యాలయం వద్ద బ్రిడ్జి లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, జయంతి-టేకుమంద, యాదమరి మండలం వరదరాజుపల్లిలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.

February 25, 2026 / 01:05 PM IST

ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల ఎంత మంది గైర్హాజరు అంటే..!

NZB : ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు 318 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, మొదటిరోజు విద్యార్థులెవరూ ఆలస్యంగా రాలేదని పేర్కొన్నారు.గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

February 25, 2026 / 01:04 PM IST

అగ్రహారం గ్రామంలో కొత్త పార్టీ కమిటీ

KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి సంబంధించిన కొత్త గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అగ్రహారం స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీని ఇంఛార్జ్‌కు బుధవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

February 25, 2026 / 01:03 PM IST

చేతివృత్తుల కళాకారులకు అవగాహన సదస్సు

WNP: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో వనిత జ్యోతి మహిళా సంఘం (NGO) సహకారంతో శ్రీరంగాపురం మండలంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మాట్లాడుతూ..కళాకారుల గుర్తింపు కార్డుల ప్రాధాన్యతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తామని బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ భరోసా కల్పించారు.

February 25, 2026 / 01:02 PM IST

పరీక్షకు హాజరుకాని 16 మంది విద్యార్థులు

MNCL: జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి పట్టణాల్లో నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 16మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 156 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245 మంది విద్యార్థులు ఆరుగురు, దండేపల్లి జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షను రాయలేదు.

February 25, 2026 / 01:01 PM IST

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: ఏఎస్సై

VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కరణ్ కోట్ పోలీసులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై రాములు అవగాహన కల్పించారు.

February 25, 2026 / 01:01 PM IST

అదనపు కోర్టుల ఏర్పాటుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

KRNL: ఎమ్మిగనూరులో అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో కోరారు. మంత్రాలయం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాల కేసులు పెరగడంతో సత్వర న్యాయం అందడం లేదని పేర్కొన్నారు. హైకోర్టు అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే వివరించారు.

February 25, 2026 / 01:00 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల భద్రతను ఎస్పీ ధీరజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాయచోటి జూనియర్ కళాశాల, సంబేపల్లి గురుకుల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, 144 సెక్షన్ అమలును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తులు ఉండరాదని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

February 25, 2026 / 01:00 PM IST

అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలి: టీసీ వరుణ్

ATP: జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కడపలో నిర్వహించిన భారీ ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు.

February 25, 2026 / 01:00 PM IST

ఏలూరులో బ్రాందీ షాపు వద్దంటూ నిరసన

ఏలూరు 1 టౌన్ పరిధి చిరంజీవి బస్టాండ్ దగ్గర తమ ఇళ్ళ మధ్య బ్రాందీషాపు పెట్టవద్దంటూ స్థానికులు బుధవారం నిరసన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆషాపులో మధ్యం దుకాణం తెరువబోతున్నారని తెలిసి బ్యానర్లతో మా పరిసర ప్రాంతాల్లో మద్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకి దిగారు. బ్రాందీ షాపు తొలగించేంతవరకు ఊరుకునేది లేదని స్దానిక మహిళలు అన్నారు.

February 25, 2026 / 01:00 PM IST