MBNR: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోభాగంగా ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..99రోజుల కార్యక్రమంలో నిర్వహించే ప్రతి అంశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NRML: జిల్లాలోని అన్ని డీడీవోలు తమ పరిధిలో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల డెమోగ్రాఫిక్ వివరాలను సరిచూడాలని జిల్లా డీటీవో సరోజ సూచించారు. మొబైల్ నంబర్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నామినీ వంటి వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో CRA NSDL Protean సైట్‌లో డీడీవో లాగిన్ ద్వారా పరిశీలించి అవసరమైతే సవరించుకోవాలని శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
GNTR: మహిళా సాధికారత సమాజాన్ని మరింత బలపరుస్తుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే సానుకూల మార్పులు వస్తాయని, ప్రతి మహిళకు హక్కులు, న్యాయం అందాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
E.G: గోకవరం మండలం మల్లవరంలో ఉద్యాన శాఖ జీడి మామిడి రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీడి మామిడి పిక్క మొక్క కంటే అంటు మొక్క మేలని శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ వివరించారు. నీరు సదుపాయం ఉన్న రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు కలుపు గొప్పు చేసే యంత్రాలను ఉచితంగా 100 శాతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు.
TG: రంగారెడ్డి జిల్లాలో కొత్వాల్ గూడా ఎకో పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కొత్వాల్ గూడా ఎకో పార్కును రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. బుద్వేల్ వద్ద ఔటర్‌కు అనుసంధానంగా ట్రంపెట్‌కు శంకుస్థాపన చేశారు.
GDWL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు జరిగాయి. జిల్లాలో మహిళా పోలీస్ విభాగం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్పీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా గౌరవించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
KMR: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని బీర్పూర్ ఎస్సై మహేందర్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆరైవ్–ఆలైవ్’ 2026 రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్ నందు వాహనదారులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ADB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చౌహన్ రవి(34)పై పీడీ చట్టం కింద జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు. రవి ఉత్తర తెలంగాణలో 26 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతడిని ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
NZB: బాల్కొండ మండల పరిధిలోని బోదేపల్లి గ్రామంలో శుక్రవారం కత్తుల మల్లయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ఈరోజు ప్రారంభించారు. గతంలో గల ట్రాన్స్‌ఫార్మర్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి దీనిని మంజూరు చేయడం సంతోషకరమన్నారు.
AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన రూ.441 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో రూ.1048 కోట్లు కొల్లగొట్టారని ఈడీ పేర్కొంది.
RR: చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, సమాజాభివృద్ధిలో భాగం కావాలన్నారు. ఆడపిల్లలకి విద్యార్థి దశ నుంచి తమ తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే మహిళలు మరింత ముందుకు వెళ్తారన్నారు.
TPT: కేవీబీ పురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన 30 మంది విద్యార్థులు శుక్రవారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులతో ముచ్చటించి అసెంబ్లీ నిర్వహణ, ప్రజాప్రతినిధుల పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం సూచించారు.
MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. సత్యనారాయణకు గతంలో బైపాస్ సర్జరీ జరగగా, కొద్దిరోజులుగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కూతురు జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.