• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దారుణం.. వదిన గొంతు కోసిన మరిది

TG: యాదాద్రి జిల్లా పాలడుగులో దారుణం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో అన్న భార్య వెంకటమ్మ గొంతును మరిది బొంత అశోక్ కత్తితో కోశాడు. అశోక్ అన్న నర్సింహ ఇటీవలే మరణించగా.. ఇరు కుటుంబాల మధ్య భూ తగాదాపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మతో అశోక్, అతని ఇద్దరు మనవళ్లు గొడవపడ్డి గొంతు కోశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 11:14 PM IST

డయేరియా వ్యాప్తిపై జగన్ ఆందోళన

AP: శ్రీకాకుళంలో డయేరియాతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంపై YCP చీఫ్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోడ్ల నిర్వహణ, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని విమర్శించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోందన్నారు.

February 24, 2026 / 10:50 PM IST

T20 WC: పాక్ ఓటమి.. సెమీస్‌కు ఇంగ్లండ్

పాక్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ 164 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ సెంచరీ(100)తో రాణించాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 19.1 ఓవర్లలో విజయాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అటు పాక్ అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 24, 2026 / 10:30 PM IST

చిన్న వయసులోనే ముసలితనం.. జాగ్రత్తపడండి!

ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతోంది. వీటిని అరికట్టాలంటే పోషకాహారం, మంచి నిద్ర అవసరం. చర్మ సంరక్షణలో భాగంగా రోజూ సన్‌స్క్రీన్, విటమిన్-C, నియాసినమైడ్ సీరమ్ వాడాలి. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.

February 24, 2026 / 10:30 PM IST

‘రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరి’

SKLM: రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అన్నారు. నందిగాం మండల పరిధిలోని చిన్నలవుని పల్లి, నౌగాం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.

February 24, 2026 / 10:13 PM IST

కోరిన చోట బస్సు ఆపాలి: పొన్నం

TG: పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా RTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. పదో తరగతి, ఇంటర్ హాల్ టికెట్లు చూపిస్తే కోరిన చోట బస్సు ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. పరీక్షల సమయంలో అదనంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 24, 2026 / 10:10 PM IST

‘రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో’

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గూండాలా, రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందన్నారు.

February 24, 2026 / 10:00 PM IST

అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ పంపిణీ

BPT: అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే సాంబశివరావు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఇసుకదర్శిలోని కార్యాలయంలో, ఇంకొల్లు గ్రామానికి చెందిన షేక్ చాందిని వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.3,02,598 విలువైన ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

February 24, 2026 / 10:00 PM IST

కుక్కకాటు బాధితులకు పరామర్శ

GNTR: జీజీహెచ్‌లో కుక్కకాటుకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళవారం పరామర్శించారు. నల్లచెరువు వద్ద కుక్కల దాడిలో గాయపడిన ఫణీంద్ర రెడ్డి, షేక్ ఆయన్‌ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

February 24, 2026 / 10:00 PM IST

విద్యుత్ శాఖ ఉద్యోగి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

PLD: మాచర్ల విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ హఠాన్మరణం చెందిన హుస్సేన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ కలిసి సేకరించిన రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం పల్నాడు జిల్లా ఎస్‌ఈ డాక్టర్ విజయకుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తా మన్నారు.

February 24, 2026 / 10:00 PM IST

VIDEO: దర్శిలో కురిసిన మోస్తరు వర్షం

ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:00 PM IST

రెండో స్థానంలో నిలిచిన ఎమ్మెల్యే థామస్

CTR: విజయవాడలోని జరిగిన ఏపీ శాసనసభక్రీడా పోటీల్లో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన ప్రతిభకనబరిచి రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 09:58 PM IST

ఓటీటీలోకి ‘హాట్‌స్పాట్: 2 మచ్’

తమిళ చిత్రం ‘హాట్‌స్పాట్: 2 మచ్’ తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రియా భవానీ శంకర్, భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. సమాజంలోని సున్నితమైన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించాడు.

February 24, 2026 / 09:55 PM IST

కర్ణాటక మంత్రులను కలిసిన భట్టి

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్ణాటక మంత్రులను కలిశారు. కృష్ణబైరె గౌడ, హెచ్.సి. మహాదేవప్ప, హెచ్.కె. పాటిల్‌ను కలిశారు. అలాగే జి.పరమేశ్వర, కె.హెచ్. మునియప్ప, బోస్ రాజుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వచ్చేనెల 5న తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.

February 24, 2026 / 09:55 PM IST

ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

AP: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్‌పై పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.

February 24, 2026 / 09:50 PM IST