AKP: రాష్ట్రంలో 2014-2025 వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బాణసంచా కేంద్రాలపై 3,219 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం శాసనసభలో ప్రకటించారు. వీటిలో 2,753 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.152 కేసులు దర్యాప్తులో ఉన్నాయన్నారు. అదే కాలంలో పోలీస్ శాఖ 26.56 కోట్ల విలువైన బాణసంచ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
NLG: వేములపల్లి మండలం సల్కునూరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
VKB: బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో బీసీ కాలనీ 2 వార్డులో రోడ్డుపై పారుతున్న మురుగునీరుతో పాదచారులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయం పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
NLG: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో కొబ్బరికాయల విక్రయానికి నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేలంలో పాట దక్కించుకున్న వారు ఏడాది పాటు విక్రయ హక్కులు పొందుతారని సర్పంచ్ నేతగాని కృష్ణ, కార్యదర్శి రవీందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనాలని వారు కోరారు.
AP: కాపీ కొట్టడం తప్ప కూటమి నాయకులు ఒరిజనల్‌గా ఏమీ చేయలేరని YCP నేత మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. సమగ్ర భూసర్వే, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించారని.. ఈ సారి అలా జరగదని, YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆత్మకూరు(నెల్లూరు) అభివృద్ధి కోసం ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూ, YCP ప్రభుత్వం వచ్చేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.
SRPT: మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బూర సైదయ్యగౌడ్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతిలో 100 సీట్లకు, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
KMR: నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం నుంచి టేకులచెరువు తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 0.8625 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అటవీ శాఖ క్లియరెన్స్ లభించింది. గతంలో అనుమతుల లేమితో నిలిచిన పనులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. సుమారు రూ.2 కోట్ల నిధులతో రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తండా వాసుల దీర్ఘకాలిక కోరిక నెరవేరనుంది.
KKD: వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న ఎం.శ్రీను (30) గురువారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఆసుపత్రికి వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రస్తుతం GGHలో చికిత్స పొందుతున్నారు.
నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్‌కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్‌ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.
అనంతపురం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మార్చి రెండో వారం నుంచి ఎండలు తీవ్రస్థాయికి చేరి, 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందన్నారు. వడగాలులు తీవ్రం కావడంతో పాటు వర్షాలు ఆలస్యంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని అంచనా వేశారు.
ELR: ఉంగుటూరు దళితపేటలో దీర్ఘకాలికంగా విద్యుత్ సమస్య తీర్చమని విద్యుత్ శాఖ ఏడీఏ రాళ్లపల్లి భీమేశ్వరరావు అన్నారు. ఉంగుటూరులో ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ సింధు ఏఈ శ్రీరామ్, లైన్‌మెన్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పెద్దమండెం మండల టీడీపీ అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు మదనపల్లెలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
VZM: సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్‌లో బుధవారం పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే, ఆన్‌లైన్ వేదికలపై పొంచి ఉన్న సైబర్ ముప్పు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
WGL: వరంగల్‌లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒకే రకమైన చికిత్సకు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాధారణ జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్యానికి కూడా రూ.300 నుంచి రూ.500కు పైగా ఓపీ (అవుట్ పేషెంట్) ఫీజులు తీసుకుంటున్నట్లు సమాచారం.
NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్రారెడ్డి రూ.1,52,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు CMRF గొప్ప వరమని, ఈ సాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.