• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈనెల 7న మెగా జాబ్ మేళా

కామారెడ్డి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ దోమకొండ పోర్టు ఆధ్వర్యంలో ఈనెల 7న దోమకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. 30కి పైగా ప్రముఖ కంపెనీలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలతో పాల్గొంటున్నాయి. కావున నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై ఉద్యోగమేలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 4, 2026 / 07:00 PM IST

జడ్చర్లలో ప్రభుత్వ అధ్యాపక సంఘం డైరీ ఆవిష్కరణ

MBNR: డా. బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ అధ్యాపక సంఘం డైరీ, క్యాలెండర్‌ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య బుధవారం ఆవిష్కరించారు. అధ్యాపకులు నిరంతరం కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు రాఘవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డా.నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:00 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ టీఎన్ దీపిక సూచనల మేరకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ ఆసిఫుల్లా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ వేళ కార్మికులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న కార్మికుల కృషిని కొనియాడారు.

March 4, 2026 / 07:00 PM IST

ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

ADB: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

March 4, 2026 / 07:00 PM IST

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

NZB: కమ్మర్పల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. హస కొత్తూరు 3, చౌటుపల్లి 2, బషీరాబాద్ 2, కొనసముందర్ 2, కోనాపూర్ 2 చెక్కులను ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో జీ . ప్రసాద్, ఆస్ఐ శరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నలిమెల రేవతి గంగాధర్, మహబూబ్, బైకని జమున మహేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:00 PM IST

2026-27 నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రారంభం

PLD: 2026-27 విద్యా సంవత్సరం నుంచి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇందులో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు, 420 పడకలతో కూడిన బోధనా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం 237 మంది డాక్టర్లు, 600 మంది సిబ్బందిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

March 4, 2026 / 06:59 PM IST

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

కృష్ణా: కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల భారతి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి దగ్గర బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆమె తల్లి కోట చంద్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేయగా, భారతి బాత్రూంలో విద్యుత్ షాక్ తగలడం వలన మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

March 4, 2026 / 06:58 PM IST

భట్టి కుమారుని పెళ్లి పనులను పరిశీలించిన కేఎల్ఆర్

RR: రేపు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య పెళ్లి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పనులను పరిశీలించారు. వీఐపీలు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

March 4, 2026 / 06:58 PM IST

మాతృ మరణాలపై కలెక్టర్ సమీక్ష

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు పూర్తిగా నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చోటుచేసుకున్న నాలుగు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించిన ఆమె, నివారించగలిగిన కేసుల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు.

March 4, 2026 / 06:58 PM IST

‘ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి’

WNP: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు మహానంది, ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ను విడుదల చేశారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

March 4, 2026 / 06:57 PM IST

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

AP: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 06:56 PM IST

పాడి రైతులకు సబ్సిడీ యంత్రాలు

CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పశువైద్య కేంద్రంలో పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను 50% సబ్సిడీపై పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు హాజరై యంత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రూ.40,500ల విలువ గల యంత్రాన్ని రూ.20,250కే అందిస్తున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 06:55 PM IST

ఎల్బీనగర్‌కు చేరుకున్న బౌద్ధ బైక్షువుల పాదయాత్ర

RR: ప్రపంచ శాంతి కోసం కర్ణాటక నుంచి బౌద్ధ బైక్షువులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి శాంతి మార్గంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని తెలిపారు.

March 4, 2026 / 06:53 PM IST

టీడీపీ నాయకురాలిపై అసభ్య పోస్టులు.. నిందితుడి అరెస్టు

GNTR: తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య ప్రచారాలు చేసినందుకు బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్‌ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టీటీడీ ఛైర్మన్ వ్యవహారంలో ఆమెను ఉద్దేశించి సయ్యద్ దుష్ప్రచారం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని సీఐ తెలిపారు.

March 4, 2026 / 06:53 PM IST

పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్

కృష్ణా: గుడివాడ చాపల మార్కెట్ వినాయకుడి గుడి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు, పోలీస్ సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై బుధవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రూ. 13,670ల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 4, 2026 / 06:53 PM IST