NDL: బేతంచెర్ల(మం) వేగం కన్న ప్రాణం ముఖ్యమని బేతంచెర్ల సీఐ డీ. వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు అన్నారు. శనివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో ఆటోడ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ చుట్టుగుంటలో ఉన్న ఎస్.కే.బి.యం స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో రేపటి (మార్చి 1) నుంచి నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందనీ ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదనీ అన్నారు. బాణాసంచా, DJలు నిషేధం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.
KMM: మోడీ పాలనలో దేశానికి ప్రమాదం ఏర్పడిందని సీపీఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శనివారం ఖమ్మం బోసుబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం దివాళా తీయిస్తోందని పేర్కొన్నారు.
బాలీవుడ్ చిత్రాలు ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లో చేరలేకపోయాయి. అయితే, ‘దురంధర్ 2’ బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునే మొదటి చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు కేవలం హిందీ వెర్షనే సుమారు రూ.80 కోట్ల వసూళ్లు సాధిస్తుందని, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా మొత్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని పేర్కొంటున్నాయి.
KRNL: కోసిగి(మం) కందుకూరులో NTR భరోసా పెన్షన్‌ను ఇవాళ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం నియోజకవర్గ TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కడపలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్, ఫార్మా రంగాల్లో నకిలీ మందులు, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లులతో ప్రజల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందుల కొరత వల్ల ప్రజలు ప్రైవేట్ వైద్యంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
E.G: కడియం పల్ల వెంకన్న నర్సరీ శనివారం విశిష్ఠ అతిథి రాకతో సందడిగా మారింది. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ బోస్లే తన కుటుంబంతో కలిసి నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా యువ రైతులు పల్ల వెంకటేశ్, వినయ్‌లు ఆయనకు బోన్సాయ్ మొక్కను బహూకరించి సాదర స్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల అరుదైన మొక్కలను తిలకరించారు.
AP: సీఎం చంద్రబాబు వేట్లపాలెంలో పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద స్పాట్‌లో అణువణువూ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.
KNR: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలకు చెందిన మొత్తం 98 మంది లబ్ధిదారులకు రూ.36,00,500 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ADB: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని గిరిజన గురుకులాల ఆర్సీవో అగస్టీన్ సూచించారు. ఉట్నూర్ మండలంలోని లాల్ టెక్డిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
WNP: 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థినీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఉచిత ప్రవేశం కల్పించి ఉచిత విద్యను అందించేందుకు స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లాలో 1 నుంచి 10వ తరగతి చదివి విద్యార్థులు అర్హులు అన్నారు. మార్చి 25 లోగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ELR: ఉంగుటూరు(మం) ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో పూర్తైన అభివృద్ధి పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు.
PLD: చిలకలూరిపేట మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం శనగ రైతులకు క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. గతంలో పొగాకు, మిర్చి రైతులకు అండగా నిలిచినట్లే, శనగ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.