• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుంది’

PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రకు బయలుదేరగా జెండా ఊపి సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ ప్రారంభించారు.

March 1, 2026 / 07:01 PM IST

ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడిని ఖండించిన సీపీఎం

కృష్ణా: గన్నవరంలో సీపీఎం నేత మల్లంపల్లి ఆంజనేయులు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను ఖండించారు. అంతర్జాతీయ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని అన్నారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 07:00 PM IST

మర్రిపూడి హెడ్ కానిస్టేబుల్ను సత్కరించిన ఎస్పీ

ప్రకాశం: మర్రిపూడిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సలీం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయడం ఆనందకరమని అన్నారు.

March 1, 2026 / 07:00 PM IST

అనారోగ్యంతో హోంగార్డ్ మహేష్ మృతి

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విసన్నపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కొలికపోగు మహేష్ (40) అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మహేష్ మరణంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచరులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 07:00 PM IST

‘అమరుల త్యాగాలు చిరస్మరణీయం’

NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 06:59 PM IST

ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన

SRD: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని,ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఓ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అధ్యయన కేంద్రంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

March 1, 2026 / 06:57 PM IST

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం రాములు తండాకు చెందిన భానోత్ నరసింహ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు.

March 1, 2026 / 06:57 PM IST

‘గొల్లలకోడేరు కాదు.. వన్ టౌన్ స్టేషనుకు రండి’

W.G: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా వన్ టౌన్ స్టేషన్‌కు రావాలన్నారు.

March 1, 2026 / 06:51 PM IST

ఇరాన్‌పై దాడిని ఖండించిన అసదుద్ధీన్

TG: ఇరాన్‌పై జరుగుతున్న దాడులను MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘ఖమేనీని హత్య చేయడం అమానుషం. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే. యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలి. ఇందులో భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగి సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంది’ అని అన్నారు.

March 1, 2026 / 06:50 PM IST

తూడుకుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 06:49 PM IST

రేపు పీజీఆర్ఎస్‌, రెవెన్యూ క్లినిక్

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలన్నారు.

March 1, 2026 / 06:49 PM IST

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో ఆదివారం రూ.10 లక్షల వ్యయంతో CC రోడ్ల నిర్మాణానికి MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంచి రహదారులు ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 06:48 PM IST

ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రూ.165 కోట్లతో అకాడమీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. మరోవైపు అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి సీజేఐ శంకుస్థాపన చేశారు.

March 1, 2026 / 06:48 PM IST

శక్తి యాప్‌పై మహిళలకు పోలీసుల అవగాహన

NLR: జిల్లాలో మహిళల భద్రతే లక్ష్యంగా నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి యాప్‌పై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో శక్తి బృందాలు పర్యటిస్తూ మహిళలు, విద్యార్థినులు ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చన్నారు.

March 1, 2026 / 06:48 PM IST

రేపు PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు ప్రత్యక్షంగా హాజరై లేదా https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

March 1, 2026 / 06:47 PM IST