తూ.గో: గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని అష్టలక్ష్మి గుడి వెనుక గల ఎర్రమట్టి కొండలను మాఫియా ముఠాలు తవ్వి తరలిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో లారీల్లో మట్టిని రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వాపోయారు. కొండల మీద చెట్లను నరికివేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NDL: ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు కొక్కంటి రామకృష్ణ (50) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాచర్ల ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో బూరుగుల గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం ఏర్పడింది, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
CTR: చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ. 59లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. సోమవారం అమ్మవారి హుండీ లెక్కించారు. రూ.59,35,838 నగదు, 38 గ్రాముల బంగారు, 155 గ్రాములు వెండి, విదేశీ కరెన్సీ నోట్లు, కాయిన్స్ వచ్చినట్టు తెలిపారు. ఈ మొత్తం 45 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా సమర్పించారన్నారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఏరియా హాస్పిటల్ ఏరియా, వెలమ వీధి, తురకబడి, కొత్త వీధి, గవర వీధి, పాత సంత బయలు, ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మెయింటినెన్స్ పనుల నిమిత్తం సరఫరా ఆపేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.
నెల్లూరు: కావలి పట్టణంలో RSR కల్యాణ మండపంలో సోమవారం నిర్వహిస్తున్న విస్తృతస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెంకి వెంకటరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో రామిరెడ్డి నివాసం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అన్నమయ్య: PGRS అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 348 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి భూమి,దారి,విద్యుత్ సమస్యలపై విజ్ఞప్తులు అందగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వార్తలు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం సుమారు రూ.55 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది భారీ ఓవర్సీస్ డీల్‌గా భావిస్తున్నారు.
SRPT: కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హామీ ఇచ్చారు. సోమవారం రాజేష్ తల్లి లలితమ్మను కలెక్టర్ కోదాడలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్ల రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
NLG: నేరేడుగొమ్ము ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో బేటి బచావో బేటీ పడావో కార్యక్రమంపై ఎంపీడీవో జయరామ్ విజయ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ చంద్రకళ ఎమ్మార్వో ఉమాదేవి, ఎంఈఓ, పోలీస్ సిబ్బంది పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శోభ పాల్గొన్నారు.
KMR: కామారెడ్డి డీఎంహెచ్‌వోగా డాక్టర్ రవీందర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం ఆయన డీఎంహెచ్‌వోగా ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో సమావేశం అయ్యారు. సర్వీస్‌లోనే ఉంటూ 2006 నుంచి 2009 వరకు ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
E.G: పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. సోమవారం హుకుంపేట కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
NTR: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 50 శాతం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజయానంద్‌కు విజ్ఞప్తి చేసింది. గంపలగూడెంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటన బాధకరం అని MLA ఆదిరెడ్డి వాసు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించామని తెలిపారు. బాధితుల చికిత్స కోసం విజయవాడ నుంచి డయాలసిస్ పరికరాలు తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడామన్నారు. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. కల్తీపై మాట్లాడే అర్హత YCPకి లేదని విమర్శించారు.
కృష్ణా: గంగూరులో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొన్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.55,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
MNCL: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలక్టరేట్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.