• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చికిత్స పొందుతున్న 15 మంది బాధితులు

E.G: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రభావితమైన 15 మంది రోగులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, డెంటల్ లో ఇద్దరు, RACCలో ఒకరు, రవి చైతన్యలో ఒకరు, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

February 28, 2026 / 06:06 PM IST

తాజ్ పూర్‌లో సైన్స్ ఫెయిర్

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

February 28, 2026 / 06:04 PM IST

WOW.. సకల సౌకర్యాలతో హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్

RR: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద రూ.29.21 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు. 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. నూతన ముఖచిత్రం, విస్తృత వేచి ఉండే హాల్స్, మెరుగైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ DRM గోపాలకృష్ణన్ వెల్లడించారు.

February 28, 2026 / 06:04 PM IST

హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కొడవలూరు మండలం గౌతమి నగర్ పంచాయతీలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేసి, చెత్త సంపద రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. రూ.36 లక్షలతో హెల్త్ క్లినిక్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి

E.G: పెరవలి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

ఇంటర్ పరీక్షకు 5 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో సాధన జూనియర్ కాలేజీలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 5 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 138 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా జడ్జి

NRML: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన అభినందనీయమని సీనియర్ జడ్జి రాధిక అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించారు.

February 28, 2026 / 06:02 PM IST

‘100 రోజుల ఆరోగ్య మిషన్’

WNP: మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం హెల్త్ మిషన్ 100 పేరుతో బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 06:01 PM IST

ఉపాధి హామీ సామాజిక తనిఖీపై సభ

NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ ముగిసింది. గత నెల 24 నుంచి కొనసాగిన తనిఖీల్లో భాగంగా నేడు గ్రామ సభ నిర్వహించారు. అధికారులు పనులను పరిశీలించి ప్రజలకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మహేందర్, కార్యదర్శి సరిత, ఎఫ్ఏ, వార్డు సభ్యులు, కారోబార్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:01 PM IST

పాఠశాలలో నేషనల్ సైన్స్ డే

KMR: బీర్కుర్ మండలంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను, చిత్రపటాలను MEO వెంకన్న వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివకుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

February 28, 2026 / 06:01 PM IST

సామర్లకోట పేలుడు ఘటనపై మంత్రి ఆవేదన

అన్నమయ్య: సామర్లకోట(మం) వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 06:01 PM IST

పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

PPM: పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి, స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసు కున్నారు.

February 28, 2026 / 06:00 PM IST

మాధవరావు సేవలను కొనియాడిన ఏఎస్పీ

SKLM: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందుతున్న పి. మాధవరావుకు శనివారం జిల్లా ఎస్పీ ఆఫీసులో రిటైర్మెంట్ కార్యక్రమం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ హాజరై, మాధవరావును పూలమాలలు, దుశాలువతో సత్కరించారు. సుదీర్ఘకాలంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు అందించిన సేవలను ప్రశంసించారు.

February 28, 2026 / 06:00 PM IST

టిడ్కో సీ-1 బ్లాక్‌లో మంచినీటి సమస్య

VSP: పెడగాడి టిడ్కో కాలనీ సీ-1 బ్లాక్‌లో మంచినీటి సమస్య తలెత్తడంతో బాధితుల పిలుపుమేరకు మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కనకరాజు శనివారం వెంటనే స్పందించారు. శుద్ధ కారణంగా పైపులు స్ట్రక్ అవుతున్నాయని గుర్తించి, మూడు రోజుల్లో పైపులు, మేన్‌హోల్స్ క్లీనింగ్ చేపడతామని తెలిపారు. గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ అడుగున మట్టి పేరుకుపోవడంతో పంపింగ్‌కు ఆటంకం కలుగుతోందన్నారు.

February 28, 2026 / 06:00 PM IST

ఘనంగా ఏఈఓ పదవి విరమణ వీడ్కోలు

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సమావేశం శనివారం జరిగింది. టీఎన్జీఓస్ స్పెషల్ యూనిట్, మినిస్టీరియల్ 4వ తరగతి సిబ్బంది యూనియన్ సభ్యులు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొని ఆలయం తరఫున శ్రీనివాస్‌కు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 28, 2026 / 06:00 PM IST