• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విజ్ఞానమే అభివృద్ధికి పునాది’

ADB: నార్నూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణలు, మోడల్స్, ప్రదర్శనలు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, శాస్త్ర సాంకేతిక ప్రగతిపై ఉపాధ్యాయులు వివరించారు. ‘విజ్ఞానమే అభివృద్ధికి పునాది’ అని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

February 28, 2026 / 02:15 PM IST

‘ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం ప్రకటించాలి’

NRML: ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం12 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఎంహెచ్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ పట్టణం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్ ఎస్సీలకు 12 లక్షల అభయ హస్తం ప్రకటించి నేటికి రెండు సంవత్సరాలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 02:15 PM IST

‘రైతులకు రైతు భరోసా విడుదల చేయాలి’

SRCL: రైతులకు రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం నాయకులు శనివారం తసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంటయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు పనులు ప్రారంభ దశలోనే రైతులకు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతు బంధు విడుదల చేసరన్నారు.

February 28, 2026 / 02:14 PM IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లుగా ప్రమాణస్వీకారం

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌లుగా మునిసిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, డైరెక్టర్‌లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:13 PM IST

‘మార్చి 31లోపు పన్నులు చెల్లించాలి’

SRD: మున్సిపాలిటీలో ఆస్తి, వాణిజ్య, కుళాయి పన్నులు మార్చి 31లోపు పూర్తిగా చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ ద్వారా కూడా పన్నులు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

February 28, 2026 / 02:12 PM IST

‘పాత కడపలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలి’

కడప: నగరం 1వ డివిజన్ పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.

February 28, 2026 / 02:12 PM IST

బొబ్బిలి రామకృష్ణకు జాతీయ సేవా విజనరీ పురస్కారం

VZM: గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బొబ్బిలి రామకృష్ణకు జాతీయ సేవా విజనరీ పురస్కారం వరించింది. ఈయన స్వస్థలం ఎస్ కోట. ఈ పురస్కారాన్ని రామకృష్ణకు విశాఖలో శనివారం జరిగిన ట్రావెల్ అండ్ ఫౌండేషన్ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రధానం చేశారు. పర్యావరణం, విద్య, ఆరోగ్యం, న్యాయ, యోగ విభాగాల్లో అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది.

February 28, 2026 / 02:11 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

TG: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో సర్కారు ఉందన్నారు. విద్యారంగంపై కమిటీ ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎవరితోనూ చర్చించకుండా నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటీ అని ప్రశ్నించారు.

February 28, 2026 / 02:10 PM IST

‘స్పిరిట్‌’ పోస్టర్‌లో కనిపించిన నటి ఎవరు?

ప్రభాస్, సందీప్ వంగా క్రేజీ కాంబో ‘స్పిరిట్’ నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో వివేక్ సరసన కనిపించిన నటి గురించే చర్చ నడుస్తోంది. ఆమె ఇండో-అమెరికన్ నటి ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ ఫేమ్ అయిన ఈ నటి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్, ఆమె కలిసి ప్రభాస్‌ను గట్టిగా ఢీకొట్టబోతున్నారని టాక్.

February 28, 2026 / 02:10 PM IST

కాకినాడలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం

కాకినాడ నడిబొడ్డున పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందభారతి మైదానం వంటి బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి, వాకింగ్ ట్రాక్స్, వ్యాయామ పరికరాలు నిరుపయోగంగా మారాయి. మైదానాలను కేవలం ప్రదర్శనలు, సమావేశాల అద్దెకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కనీస నిర్వహణను విస్మరిస్తున్నారని నగరవాసులు వాపోతున్నారు.

February 28, 2026 / 02:05 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

KNR: సైదాపూర్ మండలం రాయికల్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సర్పంచ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. బంజారా సమాజ ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఎంపీడీవో యాదగిరి, ఆస్ఐ వినోద్,మాజీ సర్పంచ్ అక్షయ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 28, 2026 / 02:05 PM IST

అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి పెంపు

ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు DPRO సంపత్ కుమార్ తెలిపారు. పాత కార్డుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో, జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీ అయ్యే వరకు పాత కార్డులే చెల్లుబాటులో ఉంటాయన్నారు.

February 28, 2026 / 02:05 PM IST

అర్హులకే ఇళ్లు కేటాయించాలని వినతి

BHPL: మహదేవపూర్ మండలంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు CPM మండల నేతలు వినతి పత్రం అందజేశారు. మండల ఇంఛార్జ్ కుమ్మరి రాజు మాట్లాడుతూ.. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 02:04 PM IST

ఆవుల మందపై పెద్దపులి దాడి

JGL: పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది.ఈ ఘటనలో మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.

February 28, 2026 / 02:02 PM IST

లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు మరోసారి వ్యాఖ్యలు చేశారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి నైవేద్యం పెట్టారని ఆరోపించారు. ప్రజలకే కాదు దేవుడికి కూడా ద్రోహం చేయాలనుకున్నారని మండిపడ్డారు. దేవుడిని తాను బజారులోకి లాగాలనుకోలేదని పేర్కొన్నారు. కానీ, జరిగిన తప్పులను ప్రజలకు వివరించానని వెల్లడించారు. 

February 28, 2026 / 02:02 PM IST