• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్‌ను కోరారు. ఏపీ వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాంతం నుంచి ఖమ్మంకు బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోతాయని, ముఖ్యంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.

February 23, 2026 / 06:11 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

AKP: జిల్లాలో 34 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఐఈఓ ఎం.వినోద్ బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం జరిగే మొదటి సంవత్సరం పరీక్షలకు 13,153 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో గల అన్ని రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు.

February 23, 2026 / 06:11 AM IST

పునఃప్రారంభం కానున్న ఏనుమాముల మార్కెట్

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా పంటల కొనుగోలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర ఉండాలని అధికారులు సూచించారు.

February 23, 2026 / 06:09 AM IST

నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

VSP: సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలకు తక్షణ స్పందనకోసమే అని చెప్పారు.

February 23, 2026 / 06:09 AM IST

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ వాసి మృతి!

ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు.

February 23, 2026 / 06:08 AM IST

కోడుమూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుడు షేక్ షాకీర్, అతని భార్య షేక్ సలీమాకు ఆదివారం కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి రూ. 4,95,699/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. పసుపుల ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు CM చంద్రబాబు , KDCC ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 06:07 AM IST

గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.

February 23, 2026 / 06:07 AM IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు: ఆర్‌ఐవో

SKLM: ఇవాళ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఐవో సురేష్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.

February 23, 2026 / 06:05 AM IST

ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్

AKP: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఆదివారం అనకాపల్లి పూడిమడక రోడ్డులో ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ధృవతారగా వెలిగిన ఎన్టీఆర్ కారణజన్ములని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు.

February 23, 2026 / 06:04 AM IST

విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.

February 23, 2026 / 06:04 AM IST

డిప్యూటీ మేయర్‌కి ఛాంబర్ ఉందా లేదా?

KNR: కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది.

February 23, 2026 / 06:04 AM IST

మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య

JGL: మల్యాల మండలం బల్వంతపూర్‌లో కొను బక్కయ్య (53) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక వేదనను తట్టుకోలేక పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మరోమారు ఆదివారం గ్రామంలోని ఓ హార్వెస్టర్‌కు నైలన్ తాడుతో ఉరి వేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 06:02 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

SRCL: ముస్తాబాద్ మండలం చీకోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పర్శ శ్రావణి సీఎం కప్ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కోచ్ రమేశ్, పాఠశాల ప్రిన్సిపల్, MEO నిమ్మల రాజిరెడ్డి, సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 23, 2026 / 06:02 AM IST

ఊపిరి ఉన్నంతవరకు ప్రజా సేవ చేస్తా: మంత్రి

కోనసీమ: ఊపిరి ఉన్నంతవరకు, అధికారం ఉన్నా లేకున్నా సమాజ సేవ చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం కె.గంగవరం మండల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో గజమాలలతో ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ సన్మానం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

February 23, 2026 / 06:00 AM IST

అనంతపురంలో రేపు జాబ్ మేళా

ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా తెలిపారు. పేటీఎం సంస్థ అనంతపురంలోని పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందన్నారు. పదవ తరగతి నుంచి పైచదువులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 23, 2026 / 06:00 AM IST