• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్‌కు సన్మానం

RR: చేవెళ్ల మున్సిపల్ నూతన ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డిలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్ర గోపాల్ యాదవ్, నరేందర్ రెడ్డి శాలువతో సన్మానించారు. మునిసిపల్ అభిరుద్దికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, యాదవ్, అశోక్, నరేష్, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 05:17 PM IST

135 మంది గైర్హాజరు..!

TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బాటనీ పేపర్–II పరీక్షలు శనివారం నిర్వహించారు. జనరల్ కోర్సులో 5,033 మందికి గాను 4,930 మంది హాజరై, 103 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 1,090 మందికి గాను 1,058 మంది హాజరై, 32 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.

February 28, 2026 / 05:17 PM IST

సిరికొండలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం

KNR: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలకు ఏమైనా విద్యుత్ సమస్య లుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వైర్లు తెగితే సిబ్బందితో రిపేర్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివాకర్ రావు, సబ్ ఇంజనీర్ నవీన్, సర్పంచ్ ముదాం రవి, ట్రాన్స్ కో సిబ్బంది పాల్గొన్నారు.

February 28, 2026 / 05:17 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: గంపలగూడెం మండలం తునికపాడు గ్రామంలో రామిశెట్టి సత్యంబాబు అనే లబ్ధిదారుడికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 44,231 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు.

February 28, 2026 / 05:17 PM IST

సీసీ డ్రెయిన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేసిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మెయిన్ రోడ్డులో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

February 28, 2026 / 05:16 PM IST

‘ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలి’

KMM: కల్లూరు మున్సిపాలిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అధికారులను సూచించారు. శనివారం కల్లూరులో పర్యటించిన ఛైర్మన్ డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 05:16 PM IST

భారీ పేలుడు.. ఘటనాస్థలానికి చంద్రబాబు

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరారు. అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో బాధితులకు ఆయన పరామర్శించనున్నారు. అలాగే, బాధిత కుటుంబాలను ఓదార్చనున్నారు.

February 28, 2026 / 05:16 PM IST

మహాదేవపట్నం స్కూల్లో సైన్స్ ఫెర్

W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. M. జాన్ బాబు సైన్సు ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నిర్మూలన అవగాహన కల్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు K.V నాగేశ్వర రావు, K. శ్రీలత, P. లక్ష్మణుడు EPC సురేష్ పాల్గొన్నారు.

February 28, 2026 / 05:15 PM IST

మరికొద్ది సేపట్లో ‘రుద్రమ-1’రాకెట్ లాంచ్

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని భద్రకాళీ బండ్ వద్ద మరికొద్ది సేపట్లో ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిన్న రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తుందని నిర్వాహకులు తెలిపారు. రాకెట్ ప్రయోగం సమయంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

February 28, 2026 / 05:14 PM IST

సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

BHNG: ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల కింద రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపదుతుందన్నారు.

February 28, 2026 / 05:13 PM IST

‘విశ్రాంతి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలి’

WNP: జిల్లా పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, ప్రజా సేవలకు ప్రతీకగా నిలిచిన పెబ్బేరు ఏఎస్సై బాలస్వామి సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బాలస్వామి వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉండాలన్నారు.

February 28, 2026 / 05:13 PM IST

తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. TTD వార్నింగ్

TPT: తిరుమలలో రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్‌పై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం కొండపై అసత్య కథనాలతో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇవాళ ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్ల వద్ద గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ చిత్రీకరించి SMలో పోస్ట్ చేశారు.

February 28, 2026 / 05:13 PM IST

మార్చిలో కొత్త కార్ల సందడి

మార్చిలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. రెనాల్ట్ డస్టర్(మార్చి 17) రీ-ఎంట్రీ ఇస్తుండగా, లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ V-క్లాస్(మార్చి 2), ఆడి SQ8 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో వస్తున్నాయి. వీటితో పాటు స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టొయోటా ఎబెల్లా EV SUVలు మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్లకు భారీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

February 28, 2026 / 05:13 PM IST

షాదీఖానా నిర్మాణానికి స్థలం అప్పగింత

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 కుంటల (అర ఎకరం) భూమిని శనివారం రెవెన్యూ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించి అప్పగించారు. రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ స్థలం మంజూరైందని మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సైసా తెలిపారు.

February 28, 2026 / 05:12 PM IST

నాచగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తదితరులకు ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈవో రంగాచారి, వేద పండితులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

February 28, 2026 / 05:12 PM IST