KNR: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. గన్నేరువరంలో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
MNCL: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిణామాలపై కాంగ్రెస్‌పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మాజీ అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్ సోమవారం మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన కూడా ఉందని గుర్తు చేశారు.
TG: మరో 3 గంటల్లో కామారెడ్డి, NZB, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో… తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తరు చిరుజల్లులు కురుస్తున్నాయి.
PDPL: సుల్తానాబాద్ మండలంలో 2వ బ్యాచ్‌గా 13 గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు కనుకుల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీ దివ్య దర్శనరావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పాలనలో సభ్యుల పాత్ర కీలకమని, గ్రామసభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా అవినీతి లేకుండా పనిచేయాలని అన్నారు.
SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇంకా పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పరిహారం చెల్లించాల్సి ఉందని నాయకులు కదిరే రాజ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రకాశం: కంభం పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మరియు మోటారు వాహన చట్టం (MV Act) ఉల్లంఘనలపై పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.
GNTR: పొన్నూరు పట్టణం 8వ వార్డు నార్త్ క్యాబిన్‌పేటకు చెందిన ఇఊరి శ్రీనివాసరావు (27) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: రేపల్లె మండలంలోని ప్రభుత్వ మరియు జెఎల్‌బి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆర్డీవో రామలక్ష్మి పరిశీలించారు. పరీక్ష గదులు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.
BDK: కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ప్రమాదకర మలుపు వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేపై ఏర్పాటు చేసిన ఈ మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు, లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవాళ వాపోయారు.
TG: ఇంటర్ పరీక్షలు FEB 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి తీసుకెళ్లకూడదు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి.
AP: తాము చెప్పులు విడిచే నిరసన చేసినట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అసలు అపచారం చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు. ‘మేం దేవుడి ఫొటోలు విసిరేశామని అబద్ధాలు చెప్పారు. వాస్తవాలు తెలియాలంటే ఫుటేజ్ బయటకు రావాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘సభ్యుల హక్కులు హరించేలా కౌన్సిల్ విధానాలు ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్న వీడియోలో బయటకొచ్చాయి’ అని MLC తోట పేర్కొన్నారు.
MHBD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఊడుగుల ఐలయ్య యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర కార్యాలయంలో వారికి సోమవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఐలయ్య అన్నారు. నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, చిన్నారులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని బాలికల ఆరోగ్యం క్షీణించకూడదని, ఎవరు బాల్యవివాహాలను ప్రోత్సహించరాదు అని హెచ్చరించారు.
అనంతపురంలోని SSBN కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 9AM నుంచి 12PM వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.