AP: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా రేపు, ఎల్లుండి శ్రీవారి SSD టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ నిన్న ప్రకటించింది. అంటే 3వ తేదీకి ముందు ఇవాళ, రేపు తిరుపతిలో టోకెన్లు జారీ చేయరు. తిరిగి ఈనెల 4న దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఎల్లుండి జారీ చేస్తారు. ఎల్లుండి వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేయడంతో రేపు ఆ సిఫార్సు లేఖలు స్వీకరించరు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం జరిగింది. ఇరాన్‌లోని టెహ్రాన్. ఇస్ఫహాన్ సహా 20 నగరాలపై దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఖండిస్తున్నానని చెప్పారు. ఇరాన్‌పై దాడులు అంతర్జాతీయ భద్రతను దెబ్బతీస్తున్నాయని చెప్పారు.
BHPL: జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో శనివారం జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలని SP ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.
HYD: దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలపై ఊరటనిస్తూ వన్‌టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. పీటీపీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
కోల్‌కతాలో ఇవాళ విండీస్‌తో భారత్ కీలక పోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. T20 WC సెమీస్ చేరేందుకు ఇరుజట్లకూ కీలకమైన ఈ మ్యాచులో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు T20ల్లో ఒక్కటీ ఓడలేదు. పైగా అక్కడ 1983 నుంచి జరిగిన ఏ అంతర్జాతీయ మ్యాచులోనూ INDను విండీస్ ఓడించలేదు. ఇంకా T20ల్లో 19-10తో విండీస్‌పై భారత్‌దే పైచేయి.
KDP: లింగాల మండలం చిన్నకుడాల, పెద్దకుడాల గ్రామాల్లోని గంగమ్మ ఆలయాల్లో ఆదివారం గంగమ్మ దేవతల తిరుణాల జరగనుంది. ఆలయ నిర్వాహకులు తిరుణాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గంగమ్మ దేవతలను భక్తులు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకోనున్నారు.
W.G: నరసాపురం మండలం కంసాలిబేతపూడిలో భారీ దొంగతనం జరిగింది. పాలీ నాగేశ్వరరావు దంపతులు వైద్యం కోసం పాలకొల్లు వెళ్లి తిరిగి వచ్చేసరికి, దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 4.5 సవర్ల బంగారం, 200 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై టి.వి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KRN: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న HYDలో జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్‌తో కలిసి చేతివృత్తుల పని వాళ్లకు ఆధునిక పనిముట్లు అందజేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కుమ్మరులకు ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. గ్రామీణ చేతి వృత్తులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని వారు తెలిపారు.
PLD: వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అర్జీల రూపంలో సమర్పించవచ్చు. అలాగే, ఉదయం 9 గంటలకు సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
WNP: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని టీజీ ఎస్ఆర్‌టీసీ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత అన్నారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో మెకానికల్, కండక్టర్, డ్రైవర్ విభాగాలలో నలుగురు ఉద్యోగులు రహీమ్, వివి మూర్తి, నీలయ్య, రాములు పదవీ విరమణ పొందిన సందర్భంగా డిపో ఆవరణలో ఘనంగా సన్మానించారు.
PLD: ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమంలో భాగంగా 49వ రోజున శనివారం రాత్రి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. నిరంతరంగా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తీరును స్థానికులు అభినందించారు.
NTR: మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తిరువూరులో సీపీఐ నేతలు శనివారం నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, ఔషధ ధరలను నియంత్రించే చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేటు ఆసుపత్రుల మాఫియాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
JN: విజయా డెయిరీ ద్వారా సేకరించే పాల కొనుగోలు ధరలను త్వరలోనే పెంచనున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. HYDలో జరిగిన సమావేశంలో జనగామ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్‌తో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మార్చి బడ్జెట్‌లో పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
MNCL: హాజీపూర్ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ్ పాండే శ్రీనివాస్‌కు కలెక్టరేట్ సూపరింటెండెంట్ -C సెక్షన్ కు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. హాజీపూర్ తహశీల్దార్‌గా కలెక్టరేట్ సి సెక్షన్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న వేమనపల్లి MRO పుష్పలతకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
E.G: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో శనివారం రాత్రి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. బాధితులను పరామర్శించి అమరావతి వెళ్తున్న సీఎంకు, కాకినాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు.