BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.
AP: పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసగించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి గత పాలకులు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఏం చేసినా చంద్రబాబే చేశారని గుర్తుచేశారు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులతో పాటు కూటమి ప్రభుత్వం గేట్లు బిగించిందన్నారు. రైతులకు సకాలంలో నీరు అందించి పంటలను కాపాడామని తెలిపారు.
ASF: పెంచికల్ పేట్ మండలం ఎలుకపల్లికి చెందిన నాగేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జేసీబీ తవ్విన మట్టి దిబ్బల సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న SI అనిల్ కుమార్ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
T20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా టీమిండియా సెమీస్ అవకాశాలు కఠినంగా మారాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రేపు భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్‌ను వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని సమాచారం. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
GNTR: రాజధాని అమరావతిలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం కూడా పర్యటించింది. తాడేపల్లి మండలం ఉండవల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ఏడీబీ అధికారులు ఈ పర్యటన ద్వారా పూర్తి అవగాహన చేసుకున్నారు.
NDL: మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. MPHEO హుస్సేన్ రెడ్డి, తదితరులు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలను సేకరించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు.
JGL: ధర్మపురి మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్‌గా వేముల నాగలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తానని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో తీవ్రమైన దాహం, నోరు ఆరిపోవడం, తలనొప్పి, అలసటగా అనిపిస్తుంది. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం డీహైడ్రేషన్‌కు ప్రధాన సంకేతం. అలాగే చర్మం పొడిబారడం, కళ్లు లోతుకు వెళ్లడం, మలబద్ధకం వంటివి కనిపిస్తాయి. తగినంత నీరు లేదా ORS తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను శ్లోక, వైబ్రాంట్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఓవర్సీస్‌లో మార్చి 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
TG: సుప్రీంకోర్టులో BRS నేత మల్లారెడ్డికి చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని శేరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై 45 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున తాము జోక్యం చేసుకోలేమని ఎస్సీ పేర్కొంది.
SDPT: పట్టణంలోని మోడల్ రైతు బజార్‌ను హరీశ్ రావు రాత్రి సందర్శించారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. అవ్వా వ్యాపారం ఎట్లుంది అని మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్‌లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు కలకుండా చూడాలని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో మహిళపై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన హేమలత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. గాయపడ్డ మహిళను స్థానికులు వెంటనే కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP: భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు తెచ్చింది టీడీపీనే అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందని మంత్రి వెల్లడించారు.
SRPT: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి,నిర్వహణ విధానాలను సమీక్షించారు.పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ప్రశ్నాపత్రాల భద్రపరిచే విధానం,హాల్ సూపరింటెండెంట్లు,ఇన్విజిలేటర్ల విధులు వంటి అంశాలను పరిశీలించారు.
SDPT: హుస్నాబాద్ నగర శివారులో బులోరా వాహనం ఢీకొని పట్టణానికి చెందిన కేశవని సంపత్ (55) మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తుండగా అతివేగంగా వస్తున్న బులోరా వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన అతన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.