• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వారంతా అద్భుతాలు సృష్టిస్తున్నారు: మిథున్

అంధుల క్రికెట్‌లో టీమిండియా ప్లేయర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ క్రికెట్‌లో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారని బీసీసీఐ అధ్యక్షుడు మిథన్ మన్హాస్ కొనియాడారు. వారి విజయాలు భారత క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్లేయర్లకు గుర్తింపును అందించడమే బీసీసీఐ లక్ష్యమని మిథున్ వెల్లడించారు.

February 22, 2026 / 12:40 AM IST

బీసీసీఐ కీలక నిర్ణయం

ఇటీవల అంధుల క్రికెట్‌లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్‌లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీసుల్లో పాల్గొనే ప్లేయర్లకు వసతితో పాటు దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులు ఆడే సదుపాయం కల్పించనుంది.

February 22, 2026 / 12:30 AM IST

చందోలులో పోలీసుల వాహన తనిఖీలు

BPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షక కవచమని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు విధించారు.

February 22, 2026 / 12:23 AM IST

భారత క్రీడాకారులపై బీజేపీ చీఫ్ ప్రశంసలు

TG: క్రీడల్లో యువత రాణించేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ప్రపంచ వేదికలపై భారతీయ త్రివర్ణ పతాకాన్ని మన క్రీడాకారులు ఎగురవేస్తున్నారని అభినందించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ప్రధాని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అలాగే, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 11:31 PM IST

యువ మేధావులతో మాట్లాడే అవకాశం దక్కింది: సీఎం

AP: భారత్ యువశక్తి ప్రతిభతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ శోభాయమానమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్స్‌పో బూత్‌ల్లో యువ మేధావులతో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ‘ఇలాంటి సదస్సులు.. అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలకు వేదికలు. మన గ్లోబల్ వేదికలు.. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. మొదట దేశ గౌరవం.. ఆ తర్వాత రాజకీయాలు ఉండాలి’ అని పేర్కొన్నారు.

February 21, 2026 / 10:58 PM IST

KGHలో శిశువు మృతదేహం.. పోలీసులు దర్యాప్తు

VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్‌టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పూడి వరప్రసాద్ సీసీ ఫుటేజీ పరిశీలించారు.

February 21, 2026 / 10:05 PM IST

సీసీ రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీ నందు జరుగుచున్న సీసీ రోడ్లు, డైన్ పనులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. దేవుడు కాలనీలో పనులు జరుగుచున్న ప్రతీచోట తిరిగి డ్రైన్స్ లెవిలింగ్‌ను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 10:01 PM IST

‘కాంగ్రెస్ కార్యాలయం పై దాడి ఖండనీయం’

KRNL: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై BJP నాయకులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పెద్దకడబూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ రాజ్ ఇవాళ అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, అభివృద్ధి చేసి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

February 21, 2026 / 10:00 PM IST

పెట్రోల్ బంక్ కార్మికులకు ప్రోత్సహాకాలు అందించిన ఎస్పీ

ELR: కైకలూరులోని పెట్రోలు బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయా పెట్రోల్ బంకులలో ఉత్తమ సేవలు అందించిన మొత్తం తొమ్మిది మంది కార్మికులకు ప్రోత్సాహ బహుమతులు అందించామన్నారు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రతి నెల నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నామన్నారు.

February 21, 2026 / 10:00 PM IST

‘ఏకీకృత కుటుంబ సర్వే ను పూర్తి చేయండి’

W.G: ఏకీకృత కుటుంబ సర్వే పై సంబంధిత అధికారులతో పగో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లాలో 6,30,947 కుటుంబాలను సర్వే చేయవలసి ఉండగా నేటి వరకు 4,73,506 కుటుంబాల సర్వేను వివిధ శాఖల సిబ్బంది పూర్తి చేయడం జరిగిందన్నారు. శాఖల వారీగా సూచించిన కుటుంబ సర్వే లక్ష్యాలను త్వరగా పూర్తిచేసి నివేదిక అందజేయాలని తెలిపారు.

February 21, 2026 / 10:00 PM IST

శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం

అన్నమయ్య: శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటాలను రాజకీయ నిరసనలకు వాడటం దైవద్రోహమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం దైవాన్ని వాడుకోవడం మహా పాపమని హెచ్చరించారు.

February 21, 2026 / 10:00 PM IST

‘చెత్త లారీలు పట్టణంలోకి రాకుండా చూడాలి’

KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోవడంపై DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంటు పరిశ్రమకు వ్యర్థాలను తరలిస్తున్న లారీలు పట్టణంలోకి ప్రవేశిస్తూ రోడ్లను అపరిశుభ్రం చేస్తున్నాయని ఆరోపించారు. చెత్త లారీలు బైపాస్ మార్గంలోనే వెళ్లేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 10:00 PM IST

నూతన వధూవరులకు జగన్‌ ఆశీస్సులు

AP: వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని తిరుమేనహళ్లిలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్జిత, యశ్వంత్‌లను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో జగన్ ముచ్చటించారు.

February 21, 2026 / 09:54 PM IST

ALERT: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

February 21, 2026 / 09:44 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MLC

MHBD: గంగారం మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మాజీ TPCC కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

February 21, 2026 / 09:43 PM IST