NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో కుల్మోనాదుల దాడిలో రెండు నెలల చిన్నారి మరణించిన ఘటనపై టి.ఆర్.పి చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు కుమ్మెర వస్తున్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవం సందర్భంగా తొలి పూజ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.
ADB: పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు నిందితులు మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ SI విష్ణువర్ధన్ తెలియజేశారు. నిన్న సిబ్బందితో సమావేశమై వివరాలను వెల్లడించారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AKP: కోటవురట్ల మండలంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు క్రాష్ ప్రోగ్రాం చేపట్టినట్లు ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో 495 హ్యాండ్ బోర్లు ఉన్నాయన్నారు. బోర్ మెకానిక్‌లు రోజు రెండు మూడు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులకు గురైన బోర్లకు 24 గంటల్లో రిపేర్లు చేస్తున్నారన్నారు. అలాగే 45 మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు.
KMR: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, అటవీ భూముల రక్షణలో విఫలమైన పిట్లం రేంజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అభిలాష్‌పై వేటు పడింది. ఈ మేరకు రాజన్న సర్కిల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అర్పణ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన పిట్లం రేంజ్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సాధారణంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹230–₹235కు, స్కిన్‌లెస్ చికెన్ ₹235కు, బోనెలెస్ చికెన్ సుమారు ₹260 వరకు విక్రయించబడుతోంది. షాపులు మరియు డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది పేర్కొన్నారు .
TPT: నాయుడుపేట పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివశంకర్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు బీఎంఆర్ నగర్, బాలాజీనగర్, బోపయ్యకాలనీ, అగ్రహారం, ఆవనిహోమ్స్, కాళహస్తి రోడ్డు, పెట్రోల్ బంక్, రాజగోపాలపురం, బస్టాండ్, శ్రీరామ్ నగర్, జూవ్వలపాలెం, అశోక్ నగర్‌లో సరఫరా ఉండదని, ఈ మేరకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
PDPL: జిల్లాలోని గ్రామీణ యువతకు RSETI పెద్దపల్లి ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ రాకేష్ తెలిపారు. మగ్గం వర్క్, క్రియేటివ్ జువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్ స్టాల్, మొదలగు కోర్సులలో శిక్షణ పొందుటకు సంస్థలో, 9392221907 నంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.
BHPL: బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లింగాల MJP ప్రిన్సిపల్ జి. విజయ తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించినట్లు, పరీక్షా హాల్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలు సిద్ధం చేశామని వెల్లడించారు.
SKLM: ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన దొంగను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ డి. లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కలి జగతి మెట్ట కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడి నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
JN: మాన్సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీను ఉపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ మృతి చెందాడు. బాధితుడి బంధువులు, స్థానిక నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, మృతదేహం త్వరగా చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు
CTR: టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో సనిమా రంగంలో ఆసక్తి నెలకొంది.
KDP: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో పోరుమామిళ్లకు చెందిన కవి బొల్లు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం తెలుగు, సాంస్కృతిక అకాడమీ AP ఛైర్మన్ విల్సన్ చేతుల మీదుగా ఆయనకు మెమెంటో అందించి సత్కరించారు.
HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.
NTR: జగ్గయ్యపేట మండలం మహమ్మద్ పేటలోని మసీదును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు సమస్యలు గురించి ఎంపీ కేశినేని దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ముస్లిం పెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.